- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాను మిస్సింగ్ కేసులో జ్యోతిష్యుడి హల్చల్.. భూదేవిలో కలిసిపోయిందంటూ
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం దొండవాక పంచాయతీ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి అలియాస్ జాహ్నవి మిస్సై 12 రోజులైనా.. ఇంకా మిస్టరీ వీడలేదు.

దిశ, వెబ్‌డెస్క్: కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం దొండవాక పంచాయతీ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి అలియాస్ జాహ్నవి మిస్సై 12 రోజులైనా.. ఇంకా మిస్టరీ వీడలేదు. పాపకు ఎవరైనాహాని తలపెట్టారా? కిడ్నాప్ చేశారా? అన్నది అంతుచిక్కక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. నిన్న గ్రామ సమీపంలో ఉన్న చెరువులో NDRF టీమ్ పాపకోసం వెతకడం కుటుంబాన్ని ఆందోళనకు గురిచేసింది. కాగా.. పాప మిస్సింగ్ విషయంలో తెలంగాణకు చెందిన ఓ జ్యోతిష్యుడ్ హల్చల్ చేశాడు. పాప ఇంటికి వెళ్లి.. తాను పూజలు చేస్తే పాప నడుచుకుంటూ తిరిగి వచ్చేస్తుందని, లేదంటే ఆశలు వదులుకోండంటూ ఆ కుటుంబాన్ని భయాందోళనకు గురిచేసినట్లు తల్లి భవాని ఆరోపించింది.
వద్దంటున్నా వినకుండా తమ ఇంటి మేడపైకి వెళ్లి పడుకున్నాడని వాపోయింది. తాను పాప తిరిగిరావడానికి ధ్యానం చేస్తానని వెళ్లాడని తెలిపింది. ఆ సమయంలో ఇంటిలో తన భర్త లేకపోవడంతో చాలా భయపడ్డామని తెలిపింది. గట్టిగా మాట్లాడితే తనకు సీఎం తెలుసని చెప్తున్నాడంది. స్థానికులు అతనితో గొడవకు దిగగా.. ఎదురు గొడవ పడ్డాడు ఆ జ్యోతిష్యుడు. తాను చెప్పిందే జరుగుతుందని, మీకు తెలుసా? నాకు తెలుసా? అంటూ తల బిరుసుగా సమాధానం చెప్పడంతో.. పోలీసులకు సమాచారమిచ్చారు.






