సంచలన పరిణామం.. అమెరికా ప్రభుత్వం షట్ డౌన్

by Malleboina Mahesh |

ప్రపంచ దేశాలపై టారిఫ్‌లను విదిస్తూ రాక్షస ఆనందం పొందుతున్న అమెరికాలో సంచలన పరిణామం చోటు చేసుకుంది.

సంచలన పరిణామం.. అమెరికా ప్రభుత్వం షట్ డౌన్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ దేశాలపై టారిఫ్‌లను విదిస్తూ రాక్షస ఆనందం పొందుతున్న అమెరికా (America)లో సంచలన పరిణామం (Sensational development) చోటు చేసుకుంది. బడ్జెట్‌కు ఆమోదం తెలపకపోవడంతో అమెరికా ప్రభుత్వం పూర్తిగా షట్ డౌన్ (US government shutdown) అయింది. రిపబ్లికన్స్ (Republicans), డెమోక్రాట్స్ (Democrats) వేర్వేరు బడ్జెట్ ప్రతిపాదనలు చేయడంతో కాంగ్రస్‌ (Congress)లో వ్యయ ప్రామాణిక బిల్లు (Standard bill of costs) ఆమోదం పొందలేదు. దీంతో అక్టోబర్ 1 అర్ధరాత్రి నుంచి ఫెడరల్ ప్రభుత్వానికి నిధుల సరఫరా ఆగిపోయింది. దీంతో అనేక విభాగాలు, కార్యాలయాలు తమ కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చింది. ముఖ్యంగా FAAలో సుమారు 11,000 మంది ఉద్యోగులను ఫర్లౌ చేయాల్సి వస్తుంది, అయితే అత్యవసర విమాన నియంత్రణ కార్యకలాపాలు మాత్రం కొనసాగుతాయి.

అదే విధంగా హెల్త్ & హ్యూమన్ సర్వీసెస్ ఏజెన్సీలలో దాదాపు 41% మంది ఉద్యోగులు పనికి దూరం కానున్నారు. ఈ షట్‌డౌన్ ప్రభావంతో ప్రజారోగ్యం, విమాన రవాణా, సామాన్య ప్రభుత్వ సేవల్లో అంతరాయం కలుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే రక్షణ, పోలీస్, అత్యవసర వైద్య సేవలు వంటి కీలక విభాగాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. కానీ ఉద్యోగులకు జీతాలు లేకుండానే పని చేయాల్సిన పరిస్థితి రావొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు, ప్రజా సౌకర్యాలకు సంబంధించిన వందల సేవలు నిలిచిపోవడంతో సాధారణ పౌరులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. కాంగ్రస్‌లో చర్చలు కొనసాగుతున్నప్పటికీ, బడ్జెట్ ఆమోదం ఎప్పటికి జరుగుతుందనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. కాగా అమెరికా ప్రభుత్వం ఇలా షట్ డౌన్ కావడం గడిచిన ఏడు సంవత్సరాల్లో ఇదే మొదటిసారిగా నలిచింది.

Next Story