- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తైవాన్‌కు యూఎస్ అభినందనలు: తీవ్రంగా ఖండించిన చైనా
by samatah |
తైవాన్‌లో ఇటీవల ఎన్నికలు జరగగా డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ అభ్యర్థి లై చింగ్-తే విజయం సాధించిన విషయం తెలిసిందే.

X
దిశ, నేషనల్ బ్యూరో: తైవాన్‌లో ఇటీవల ఎన్నికలు జరగగా డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ అభ్యర్థి లై చింగ్-తే విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో అమెరికా తైవాన్ ప్రజలకు శనివారం అభినందనలు తెలిపింది. తాజాగా దీనిపై చైనా స్పందించింది. యూఎస్ ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపింది. చైనా విదేశాంగ మంత్రి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. యూఎస్ ప్రకటన తైవాన్ ప్రజలకు తప్పుడు సంకేతాన్ని పంపుతుందన్నారు. దీనిని వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. తైవాన్ తో పరస్పర అధికారిక చర్యలను నిలిపివేయాలని కోరారు. వేర్పాటు వాద శక్తులకు తప్పుడు సంకేతాలను పంపడం సరికాదన్నారు. చైనా సూత్రాలను అమెరికా ఉల్లంఘిస్తోందని ఆరోపించారు.
Next Story






