- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాకు న్యాయం చేయండి.. సమగ్ర విచారణ జరిపించాలి
మినీ గురుకులం (ఎస్టీ బాలికల) పాఠశాల, చివ్వేంలలో అకౌంటెంట్ పోస్టు తనకు రావాల్సి ఉండగా అక్రమంగా వేరొకరికి కేటాయించారని బాధితురాలు బానోత్ యశోద ఆరోపించారు.

దిశ, చివ్వేంల : మినీ గురుకులం (ఎస్టీ బాలికల) పాఠశాల, చివ్వేంలలో అకౌంటెంట్ పోస్టు తనకు రావాల్సి ఉండగా అక్రమంగా వేరొకరికి కేటాయించారని బాధితురాలు బానోత్ యశోద ఆరోపించారు. సోమవారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యశోద మాట్లాడుతూ.. మినీ గురుకులంలో ఖాళీగా ఉన్న అకౌంటెంట్ పోస్టుకు సంబంధించి 2026 మే 27న తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (TGTWWREIS) మాసాబ్ ట్యాంక్ ప్రధాన కార్యాలయం నుంచి తన పేరుతో నల్గొండ ఆర్‌సీ కార్యాలయానికి మెమో పంపించినట్లు తెలిపారు. అయితే ఆ మెమో ఆధారంగా తనకు జాయినింగ్ ఆర్డర్ ఇవ్వకుండా ఆర్‌సీఓ కాలయాపన చేశారని ఆరోపించారు.
తన పేరుతో వచ్చిన మెమోను అక్రమంగా మార్చి, జూలై 2న సాయి ప్రత్యూష అనే మహిళకు నియామక ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు. ఈ విషయమై పలుమార్లు ఆర్‌సీఓను కలిసి వివరణ కోరినా, తనకు ఆర్డర్ కాపీ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిబంధనలకు విరుద్ధంగా స్థానికురాలైన తనకు రావాల్సిన ఉద్యోగాన్ని నాన్-లోకల్ అభ్యర్థికి కేటాయించడం అన్యాయమని యశోద ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులైన ఆర్‌సీఓపై తగిన చర్యలు తీసుకోవడంతో పాటు తనకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె భర్త దుర్గ స్వామినాథ్ పాల్గొన్నారు.






