- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. డైరెక్ట్ ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ ఠాకూర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ
2022 చివరకే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయినప్పటికీ.. నాలుగేళ్ల పాటు విడుదలకు నోచుకోని ఈ మూవీ విడుదల కాబోతుంది.

దిశ, సినిమా: ఇటీవల ‘డెకాయిట్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన మృణాల్ ఇప్పుడు ఓ సస్పెన్స్ థ్రిల్లర్‌తో అభిమానులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మృణాల్ ఠాకూర్, హ్యూమా ఖురేషి ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘పూజా మేరీ జాన్’ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. దాదాపు నాలుగేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకుంది. తమ రాబోయే కొత్త కంటెంట్ లిస్ట్‌లో ఈ సినిమాను అధికారికంగా చేర్చినట్లు జీ5 ప్రకటించింది. అయితే, దీని స్ట్రీమింగ్ డేట్‌ను మాత్రం సస్పెన్స్‌లో ఉంచారు. నిజానికి, ఈ సినిమాను మొదట ‘జియో సినిమా’లో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ, జియో సినిమా డిస్నీ+ హాట్‌స్టార్ విలీనం తర్వాత ఈ సినిమా విడుదల ప్లాన్స్ అన్నీ నిలిచిపోయాయి. 2022 చివరకే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయినప్పటికీ.. నాలుగేళ్ల పాటు విడుదలకు నోచుకోని ఈ మూవీ విడుదల కాబోతుంది.
నవజ్యోత్ గులాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని దినేష్ విజన్ మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించగా.. ఇందులో విక్రమ్ సింగ్ చౌహాన్, విజయ్ రాజ్ కీలక పాత్రలు నటించారు. ఈ సినిమా కథ విషయానికొస్తే.. పూజా అనే ఒక సాదాసీదా అమ్మాయి చుట్టూ తిరుగుతుందని టాక్. ఈమె జీవితంలోకి ఒక అపరిచిత వ్యక్తి ప్రవేశిస్తాడు. అతను పూజాను పిచ్చిగా ప్రేమిస్తూ, ఆమె ప్రతి కదలికను గమనిస్తూ ఉంటాడు. డిజిటల్ యుగంలో ఒక అమ్మాయిని ఎలా ట్రాక్ చేయవచ్చో, సోషల్ మీడియా ద్వారా ఆమె వ్యక్తిగత జీవితంలోకి ఎలా చొరబడవచ్చో ఈ సినిమాలో చూపించబోతున్నారట. పూజాను ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, ఇంటర్నెట్ ద్వారా తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేస్తూ ఉంటాడని తెలుస్తోంది. ఈ డిజిటల్ వేధింపుల వల్ల పూజా జీవితం ఎలా నరకంగా మారింది? ఆ అజ్ఞాత వ్యక్తి నుండి తనను తాను కాపాడుకోవడానికి ఆమె ఎలాంటి పోరాటం చేసింది? అనేదే అసలు కథ.






