సంచలన పరిణామం.. పరస్పర సుంకాలపై అమెరికా, చైనా ఒప్పందం

by Malleboina Mahesh |

నిన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న చైనా, అమెరికా మధ్య సంచలన పరిణామం చోటు చేసుకుంది. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ ప్రపంచంలోని వివిధ దేశాలపై ప్రతీకార సుంకాలను అమాంతం పెంచేశాడు.

సంచలన పరిణామం.. పరస్పర సుంకాలపై అమెరికా, చైనా ఒప్పందం
X

దిశ, వెబ్ డెస్క్: నిన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న చైనా, అమెరికా మధ్య సంచలన పరిణామం చోటు చేసుకుంది. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ (Trump) ప్రపంచంలోని వివిధ దేశాలపై ప్రతీకార సుంకాల (Retaliatory tariffs)ను అమాంతం పెంచేశాడు. దీంతో ప్రపంచ మార్కెట్లు కుదేలవ్వడంతో పాటు అమెరికా ఆర్థిక మాంద్యం వైపు అడుగులు వేస్తుందని విశ్లేషకులు హెచ్చరించడంతో పాటు భారత్ వంటి దేశాల జోక్యం చేసుకోవడంతో సుంకాల పెంపు నిర్ణయాన్ని ట్రంప్ వెనక్కి తీసుకున్నారు. కానీ చైనా‌పై మాత్రం మూడు రెట్ల రెట్టింపు సుంకాలను పెంచాడు. అనంతరం చైనా కూడా అమెరికాపై మూడు రేట్ల సుంకాలను పెంచడంతో ఇరు దేశాల మధ్య ట్రేడ్ వార్ జరిగింది. కాగా ఎవరూ ఉహించని విధంగా ఈ రోజు అమెరికా, చైనా మధ్య జరిగిన చర్చలు సఫలం (Negotiations are successful) అయ్యాయి.

ఈ మేరకు అమెరికా, చైనా పరస్పర సుంకాలను (టారిఫ్‌లు) తగ్గించుకునేందుకు 90 రోజుల ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధాన్ని (Trade war) తాత్కాలికంగా తగ్గించే దిశగా విశ్లేషకులు చెబుతున్నారు. కాగా తాజా ఒప్పందం ద్వారా అమెరికా.. చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలను 145% నుంచి 30%కి 90 రోజుల పాటు తగ్గించింది. అలాగే చైనా.. అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలను 125% నుండి 10%కి 90 రోజుల పాటు తగ్గించింది. ఈ ఒప్పందం జెనీవాలో రెండు రోజుల పాటు జరిగిన చర్చల తర్వాత ఖరారైంది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్, వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ ఈ చర్చల్లో పాల్గొన్నారు.

Next Story