- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్ - పాక్ మధ్య యుద్ధ వాతావరణం.. రంగంలోకి ఐక్యరాజ్యసమితి
భారత్(India), పాకిస్తాన్(Pakistan) దేశాల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి(United Nations) కీలక ప్రకటన చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: భారత్(India), పాకిస్తాన్(Pakistan) దేశాల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి(United Nations) కీలక ప్రకటన చేసింది. రెండు దేశాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది. ఉద్రిక్తలు తీవ్రస్థాయికి చేరడం బాధాకరం అని పేర్కొంది. జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లోని పెహల్గాం ఉగ్రదాడి(Terrorist Attack) తర్వాత భావోద్వేగాలను అర్థం చేసుకోగలం.. కానీ యుద్ధం పరిష్కారం కాదని పేర్కొంది. పొరపాట్లు చేయొద్దు.. సైనిక చర్యలకు దిగొద్దు అని రిక్వెస్ట్ చేసింది. ఉద్రిక్తలను నివారించే చర్యలకు తాము సహకరిస్తామని ప్రకటన చేసింది. సోమవారం ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరెస్ ఈ ప్రకటన చేశారు. కాగా, పెహల్గాం(Pahalgam) ఉగ్రదాడిలో దాదాపు 28 మంది అమాయక టూరిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ అటాక్‌ను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఉగ్రవాదులకు, వారికి సహకరించిన వారికి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు. మరోవైపు పాకిస్తాన్ కూడా కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.






