Russia-Ukraine : ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా.. 48 మంది మృతి

by Disha Web Desk 12 |
Russia-Ukraine : ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా.. 48 మంది మృతి
X

కీవ్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో పౌరుల మరణాలు ఆగడం లేదు. ఉక్రెయిన్‌లోకి ఖర్కీవ్ రీజియన్‌లోని హ్రోజా అనే గ్రామంపై రష్యా మోర్టార్ షెల్‌లతో గురువారం విరుచుపడింది. గ్రామంలోని ఓ షాపు, ఓ కేఫ్‌పై చేసిన దాడిలో 48 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారని స్థానిక గవర్నర్ ఒలేహ్ సినీహుబోవ్ వెల్లడించారు. మృతుల్లో ఆరేళ్ల చిన్నారి సైతం ఉన్నాడని తెలిపారు.

ఇదే రోజు మరో ప్రాంతంలోనూ డ్రోన్లతో పెద్ద ఎత్తున దాడి చేసినట్టు స్థానిక మీడియా పేర్కొంది. ఇందులో ప్రాణనష్టం వివరాలు తెలియరాలేదు. కాగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పాశ్చాత్య మిత్ర దేశాల మద్దతు కూడగట్టేందుకు 50 యూరోపియన్ నాయకులతో కూడిన శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు స్పెయిన్ వెళ్లారు. ఇదే సమయంలో రష్యా పెద్ద ఎత్తున దాడికి పాల్పడటం గమనార్హం.


Next Story