- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
UK BILL: యూకే చరిత్రలోనే దారుణ చట్టం.. ప్రవాసులకు అన్యాయం!
బ్రిటన్ చరిత్రలోనే ఇంత చీకటి చట్టం మరొకటి లేదని అక్కడి ప్రవాసులు మండిపడుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: యూకే ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం (UK BILL) ఇప్పుడు ప్రవాసులను తీవ్రంగా కలవరపెడుతున్నది. ఆ దేశ చరిత్రలోనే దీనినో చీకటి చట్టంగా వారు అభివర్ణిస్తున్నారు. 2025లో తెచ్చిన చట్టం 2021నుంచి వచ్చిన ప్రవాసులకు వర్తిస్తుందని చెప్పడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆ చట్టంప్రకారం పర్మినెంట్ రెసిడెన్స్ ఇవ్వాలంటే ఇంతకుముందు ఐదేళ్లు ఉన్న పరిమితిని ఇప్పుడు ఏకంగా 10 నుంచి 15ఏళ్లకు పెంచారు. దీనివల్ల తక్కువ వేతనాలకు పనిచేస్తున్నవాళ్లు మరో 10, 15ఏళ్లు ఎదురుచూడాలి. దీనిని భారతీయులు సహా ప్రవాసులు అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఈ రోజు చట్టం తెచ్చి ఏళ్లుగా ఉంటున్నవాళ్లకు కూడా వర్తిస్తుందని ఎలా చెప్తారని వారు ప్రశ్నిస్తున్నారు. క్రికెట్ ఆట మధ్యలో ఏకపక్షంగా బౌండరీని ఒక్కసారిగా దూరం జరపినట్టుగా ఉన్నదని ప్రభుత్వ చర్యపై మండిపడుతున్నారు. వీసా తీసున్నప్పుడు ఉన్న రూల్స్‌ని మధ్యలో ఎలా మార్చుతారని భారతీయ ప్రవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది పూర్తిగా మోసపూరిత చర్య అని విమర్శలు చేస్తున్నారు. చట్టం పాసైన రోజునుంచి నిబంధనలు అమలుచేయాలే కానీ, ఏళ్లుగా ఉంటున్నవారికి మరికొద్దిరోజుల్లో పీఆర్ అందుకునేవారికి కూడా చట్టం అమలు అవుతుందని చెప్పడం దారుణంగా వంచించడమేనని అంటున్నారు. అందుకే చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ కు పిటిషన్లు పెడుతున్నారు. ఏదైనా చట్టంపై అభ్యంతరాలు ఉంటే ఆ పిటిషన్ పై లక్ష మంది సంతకం చేస్తే పార్లమెంట్ ఆ అంశాన్ని మరోసారి చర్చిస్తుంది. మంగళవాం మధ్యాహ్నం నాటికి దాదాపు లక్షాఎనభైవేలమంది సంతకం చేశారు. జనవరి లేదా ఫిబ్రవరి పార్లమెంట్ లో ఈ చట్టంపై మరోసారి చర్చ జరిగే అవకాశం ఉన్నది. మరి ఈ వివాదాస్పద బిల్లు అమల్లోకి వస్తుందా? లేక నిబంధనలు మార్చుతారా? అన్నది వేచిచూడాలి. వివక్షపూరిత బిల్లుపై భారత ప్రభుత్వం కూడా స్పందించాలని ప్రవాసులు కోరుతున్నారు. తమ భవిష్యత్తును అగమ్యగోచరం కాకుండా సాయం చేయాలని అర్థిస్తున్నారు.






