- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయ విద్యార్థులు దుర్మరణం
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లి ఇద్దరు భారతీయ విద్యార్థులు తిరిగిరాని లోకాలకు వెళ్లారు.

దిశ, వెబ్ డెస్క్: ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లి ఇద్దరు భారతీయ విద్యార్థులు (Indian stundents) తిరిగిరాని లోకాలకు వెళ్లారు. అమెరికాలో (America) మరో ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతిచెందారు. పెన్సిల్వేనియాలో శనివారం (అమెరికా కాలమానం ప్రకారం) జరిగిన రోడ్డు ప్రమాదం (Road accident) ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లాంకాస్టర్ కౌంటీలోని పెన్సిల్వేనియా టర్న్‌పైక్ వద్ద విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పింది. రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టి వంతెన మధ్యలో ఇరుక్కుపోయింది.
ఈ ప్రమాదంలో మానవ్ పటేల్(20), సౌరవ్ ప్రభాకర్(23) మృతిచెందినట్లు భారత కాన్సులేట్ వెల్లడించింది. మృతులు ఒహియోలోని క్లీవ్‌లాండ్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్నట్లు తెలిపింది. ప్రమాదం జరిగిన సమయంలో సౌరవ్ ప్రభాకర్ వాహనాన్ని నడుపుతుండగా.. మానవ్, మరో వ్యక్తి కారులో ఉన్నట్లు పెన్సిల్వేనియా పోలీసులు వెల్లడించారు. వాహనం ముందు సీటులో ఉన్న మరో వ్యక్తి గాయపడగా.. పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మృతుల కుటుంబాలకు అన్నివిధాలుగా అండగా ఉంటామని, మృతదేహాలను స్వదేశానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని భారత కాన్సులేట్ వెల్లడించింది.






