ఒంటి చేత్తో 116 కేజీల బరువు.. గిన్నిస్ రికార్డు సృష్టించిన తుర్కియే వీరుడు!

by Ramesh Naini |

తుర్కియేకు చెందిన బురాక్ యాజ్గీ తన అసాధారణమైన శరీర బలంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరును లిఖించుకున్నారు.

ఒంటి చేత్తో 116 కేజీల బరువు.. గిన్నిస్ రికార్డు సృష్టించిన తుర్కియే వీరుడు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తుర్కియేకు చెందిన బురాక్ యాజ్గీ తన అసాధారణమైన శరీర బలంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో (Guinness World Records) తన పేరును లిఖించుకున్నారు. అత్యంత కఠినమైన ఫిట్‌నెస్ ఫీట్లలో ఒకటైన ‘టర్కిష్ గెట్ అప్’ (Turkish Get Up) విధానంలో ఆయన ఈ రికార్డును సాధించారు. పడుకున్న స్థితిలో ఉండి, కేవలం ఒంటి చేత్తో 116.83 కేజీల భారీ బరువును మోస్తూ, బ్యాలెన్స్ తప్పకుండా పైకి లేచి నిలబడి, మళ్లీ అదే క్రమంలో కిందికి చేరుకున్నారు. ఈ ఫీట్ చూస్తున్నంత సేపు నెటిజన్లు ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు.

గతేడాది డిసెంబర్ 5న బురాక్ ఈ అసాధ్యమైన ఫీట్‌ను చేయగా, దీనికి సంబంధించిన వీడియోను గిన్నిస్ సంస్థ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. బురాక్ చూపిస్తున్న ఏకాగ్రత, కండ బలాన్ని చూసి ఫిట్‌నెస్ ప్రేమికులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

గమనిక: ఇది అత్యంత ప్రమాదకరమైన ఫీట్, సరైన శిక్షణ లేకుండా ఇంటి దగ్గర ఎవరూ ఇలాంటివి ప్రయత్నించకండి.

Next Story