- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్‌తో ట్రేడ్ డీల్‌పై ట్రంప్ కీలక ప్రకటన
భారత్‌తో ట్రేడ్ డీల్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న వేళ ట్రంప్ మీడియా అడిగిన ప్రశ్నలపై స్పందించారు.

దిశ, వెబ్ డెస్క్: భారత్‌తో ట్రేడ్ డీల్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న వేళ ట్రంప్ మీడియా అడిగిన ప్రశ్నలపై స్పందించారు. భారత్, అమెరికా దేశాల మధ్య త్వరలో ట్రేడ్ డీల్ కుదురుతుందని అన్నారు. భారత్ పై టారిఫ్స్ విధించడం తప్పేమీ కాదన్నారు. ఏళ్లుగా అమెరికా విధానాలను అవకాశంగా తీసుకుని భారత్ భారీగా సుంకాలు విధించిందని కానీ తాము అలా విధించలేదని చెప్పారు. ప్రధాని మోడీ తమకు మంచి మిత్రుడు అని, ఆయన అంటే చాలా ఇష్టం అని పేర్కొన్నారు. మోడీతో తమకు సఖ్యత ఉందని, భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదురుతుందని ఆశించారు. ఇక భారత్ లో అమెరికా ప్రతినిధుల బృందం నాలుగు రోజుల పాటు వాణిజ్య చర్చలు జరిపింది. అమెరికా ప్రతినిధుల బృందం చర్చల అనంతరం ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.






