పెరుగుతున్న ఎబోలా కేసులు.. ట్రంప్ కీలక నిర్ణయం

by Ajay Maddhiboyina |

ఆఫ్రికా దేశంలో కాంగోలో ఎబోలా కేసులు పెరుగుతుండటంతో ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ బారినపడ్డ అమెరికన్లను స్వదేశానికి తీసుకువచ్చి చికిత్స అందించకుండా కెన్యాలోని ఓ ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించాలని ఆలోచిస్తోంది.

పెరుగుతున్న ఎబోలా కేసులు.. ట్రంప్ కీలక నిర్ణయం
X

దిశ‌, వెబ్ డెస్క్: ఆఫ్రికా దేశంలో కాంగోలో ఎబోలా కేసులు పెరుగుతుండటంతో ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ బారినపడ్డ అమెరికన్లను స్వదేశానికి తీసుకువచ్చి చికిత్స అందించకుండా కెన్యాలోని ఓ ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించాలని ఆలోచిస్తోంది. కాంగోలో వైరస్ బారినపడ్డవాళ్లు తిరిగి అమెరికాకు రాకుండా కెన్యాలోనే క్వారంటైన్ కేంద్రం, చికిత్సా కేంద్రం ఏర్పాటు చేశామని వైట్ హౌస్ పరిపాలన అధికారి ఒకరు వెల్లడించారు. రోగులను అమెరికాకు తరలించాలంటే గంటల సమయం పడుతుంది అలా అవ్వకుండా త్వరగా వైద్యం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

మరోవైపు ఇప్పటికే వ్యాధిసోకిన అమెరికన్లను జర్మనీలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఉగాండలోని వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ఆరుగురు అమెరికన్లు ఎబోలా బారినపడినట్టు అధికారులు గుర్తించారు. ఇదిలా ఉంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలా వ్యాప్తిపై ప్రపంచ దేశాలను ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. వైరస్ చురుకుగా వ్యాపిస్తోందని ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ప్రస్తుతం వ్యాపిస్తున్న వైరస్ బండిబుగ్యో అనే అరుదైన వేరియంట్ అని ప్రస్తుతం దీనికి టీకాలు, చికిత్సలు అందుబాటులో లేవని హెచ్చరించింది.

Next Story