ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. 12 దేశాల పౌరులకు అమెరికాలో నో ఎంట్రీ

by Yella Dhawani Reddy |

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. 12 దేశాల పౌరులకు అమెరికాలో నో ఎంట్రీ
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వలస విధానాలు, విదేశీ విద్యార్థులపై ఆయన కఠినమైన, వివాదాస్పదమైన నిర్ణయాలను అమలు చేస్తున్నాడు. ఇక తాజాగా మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులపై సంతకం చేశారు. అగ్రరాజ్యం అమెరికాకు వచ్చే 12 దేశాల పౌరులపై ట్రావెల్ బాన్ (Travel ban on citizens of 12 countries) విధించారు. ఈ నిర్ణయం సోమవారం నుంచి అమల్లోకి రానుంది.

ఈ దేశాలలో ఆఫ్ఘనిస్థాన్‌, ఇరాన్‌, యెమెన్‌, మయన్మార్‌, చాడ్‌, కాంగో రిపబ్లిక్‌, ఈక్వటోరియల్‌ గినియా, ఎరిట్రియా, హైతీ, లిబియా, సోమాలియా, సూడాన్‌ వంటి ముస్లిం ప్రబల దేశాలు ఉన్నాయి. వీటి పౌరులు ఇకపై అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రత్యేక అనుమతులు లేకుండా ప్రయాణించలేరు. కొలరాడో రాష్ట్రంలో ఇటీవల యూదు మతానికి చెందిన సమూహంపై ఓ వ్యక్తి సీసా బాంబులతో దాడి చేసిన ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో భద్రతాపరమైన ఆందోళనలు, ఉగ్రవాద ముప్పులు పెరుగుతున్న నేపథ్యంలో, విదేశాల నుంచి వచ్చే పౌరులపై కఠినమైన నియంత్రణలు అవసరమని ట్రంప్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

కాగా, ఇంతకు ముందు బురుండి, క్యూబా, లావోస్‌, సియోర్రా లియోన్‌, టోగో, తుర్క్‌మెనిస్థాన్‌, వెనిజులా వంటి మరో ఏడు దేశాలపై పాక్షికంగా నిషేధం విధించారు. అంటే ఆ దేశాల నుంచి పౌరులు వచ్చే ప్రక్రియపై మరింత కఠిన నియంత్రణలు, అధికంగా వీసా పరిశీలనలు జరుగుతాయి. ఇది అమెరికాలో మత సామరస్యాన్ని కాపాడే చర్యగా ట్రంప్‌ ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఈ చర్యపై అమెరికాలో పెద్దఎత్తున విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Next Story