- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రంప్ సంచలన ప్రకటన.. ఇరాన్ నాయకత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. ఇరానియన్ దేశభక్తులారా మీ నిరసనలు కొనసాగించడని ట్రూత్ లో పేర్కొన్నారు. మీ సంస్థలను మీ ఆధీనంలోకి తీసుకోండి అంటూ పిలుపునిచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. ఇరానియన్ దేశభక్తులారా మీ నిరసనలు కొనసాగించడని ట్రూత్ లో పేర్కొన్నారు. మీ సంస్థలను మీ ఆధీనంలోకి తీసుకోండి అంటూ పిలుపునిచ్చారు. హంతకులు, దుర్వినియోగదారుల పేర్లను సేవ్ చేసుకోవాలని సూచించారు. వారు భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని.. అతి త్వరలో మీకు సహాయం అందిస్తామని చెప్పారు. నిరసనకారులను అర్ధంలేని విధంగా చంపడం ఆగిపోయేవరకు ఇరాన్ అధికారులతో తన సమావేశాలు అన్ని రద్దు చేసుకుంటానని చెప్పారు.
మరోవైపు ఇరాన్ లో 1,847 మంది నిరసనకారులు మరణించినట్టు అమెరికాలోని ఓ మానవ హక్కుల సంస్థ ప్రచురించింది. మృతుల్లో 135మంది ప్రభుత్వానికి సంబంధించినవారు ఉన్నారని పేర్కొంది. అంతేకాకుండా తొమ్మిది మంది పిల్లలు ఉన్నట్టు తెలిపింది. నిరసనలో పాల్గొనని తొమ్మిది మంది పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయారని స్పష్టం చేసింది. ఇక ఇరాన్ లో ప్రస్తుతం ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేకపోవడంతో మరణించిన వారి వివరాలను అంచనావేయడం సైతం కష్టంగా మారింది. ప్రభుత్వం సైతం ఇప్పటివరకు దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు.






