- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విమానం దిగుతూ తడబడిన ట్రంప్.. మరోసారి తెరపైకి ఆరోగ్యంపై చర్చ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. శనివారం ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ఫ్లోరిడా చేరుకున్న ఆయన.. మెట్లు దిగుతూ తడబడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో (X) వైరల్‌గా మారింది. 78 ఏళ్ల ట్రంప్, విమానం మెట్లు దిగుతున్నప్పుడు రెయిలింగ్ గట్టిగా పట్టుకుని చాలా నెమ్మదిగా, అతి జాగ్రత్తగా అడుగులు వేయడం ఆ వీడియోలో కనిపించింది. ఆయన చాలా అలసిపోయినట్లుగా ఉన్నారని, వయసు పైబడిన లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయాల భారమే ఇలా కుంగదీస్తోందని విమర్శిస్తుండగా, మరికొందరు వయసు పైబడినా చురుగ్గా ఉండే బైడెన్‌ను ఉదాహరణగా చూపుతూ ట్రంప్‌ను ఎద్దేవా చేస్తున్నారు.
కూర్చోవడానికి ఇబ్బంది పడిన ట్రంప్
శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో కూడా, టేబుల్ పట్టుకుని కుర్చీలో కూర్చోవడానికి ట్రంప్ ఇబ్బంది పడినట్లు మరో వీడియోలో వెల్లడైంది. ఇటీవల ఆయన చేతుల రంగు మారడం, చీలమండలు వాచడం వంటి పరిణామాలు ఆయన అనారోగ్య వార్తలకు మరింత బలం చేకూర్చాయి. అయితే, వైట్ హౌస్ వైద్యుడు రోనీ జాక్సన్ నివేదికను ఉటంకిస్తూ.. తానే ‘అత్యంత ఆరోగ్యవంతమైన అధ్యక్షుడిని’ అని ట్రంప్ తనను తాను సమర్థించుకుంటున్నారని అంతర్జాతీయ మీడియా తెలిపింది.






