- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక్క దెబ్బతో మట్టుపెట్టవచ్చు.. మరోసారి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఇరాన్ నాయకత్వంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఒక్క దెబ్బతో ఇరాన్ నేతలను అంతం చేయగలం అని వ్యాఖ్యానించారు. కానీ అలా చేస్తే చర్చలు జరపడానికి ఎవరూ మిగలరు అని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ నాయకత్వంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఒక్క దెబ్బతో ఇరాన్ నేతలను అంతం చేయగలం అని వ్యాఖ్యానించారు. కానీ అలా చేస్తే చర్చలు జరపడానికి ఎవరూ మిగలరు అని అన్నారు. ఇరాన్ తో అనుచర్చలు కొనసాగాలి అనే ఉద్దేశంతోనే అలాంటి చర్యలకు దిగలేదని చెప్పారు. ఇరాన్‌ను తీవ్రంగా దెబ్బతీశామని, ఇప్పుడు వాళ్లు ఒప్పందం చేసుకోవాలని ఆత్రుతగా ఉన్నారని అన్నారు. అంత్యక్రియలు నిర్వహించుకునేందకు మేమే వారికి వారం రోజుల టైమ్ ఇచ్చామని వ్యాక్యానించారు. ఇరాన్ మాజీ సుప్రీం ఖమేనీ అంత్యక్రియల నేపథ్యంలో దౌత్యానికి విరామం ఇవ్వడమనేది పరస్పర నిర్ణయం అని చెప్పారు.
ఈ సమయంలో ఎవరూ కాల్పులు జరపకూడదని అన్నారు. చర్చలు తిరిగి ప్రారంభించే ముందు వారం రోజులు విరామం తీసుకోవడానికి ఇరు ప్రభుత్వాలు అంగీకరించాయని తెలిపారు. ఖమేనీ మరణం తరవాత ప్రజల నుండి భిన్నమైన స్పందన తాను ఊహించానని చెప్పారు. ఏడుస్తున్న జనసమూహాల మధ్య ఖమేనీ ఫోటోలు చూపిస్తూ ద్వేషిస్తున్నవాళ్లను చూశానని వ్యాఖ్యానించారు. ఇరాన్ ప్రజలు ఏడవటం చూసి ఆశ్చర్యపోయానని బహుశా అవి నకిలీ కన్నీళ్లు కావచ్చు అని ఎద్దేవా చేశారు. అంత్యక్రియలకు హాజరైన ప్రభుత్వ పెద్దలు ప్రమాదంలో ఉన్నప్పటికీ వారిని లక్ష్యంగా చేసుకోబమని అన్నారు. వాళందరినీ ఒక్క తూటాతో మట్టుపెట్టవచ్చు అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.






