- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్‌తో యుద్ధం ముగిసినట్లే.. ట్రంప్ కీలక ప్రకటన
ఇరాన్ దేశంతో ఫిబ్రవరిలో మొదలైన ఘర్షణలు ముగిశాయని యుఎస్ కాంగ్రెస్ కు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ తో యుద్ధం పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ దేశంతో ఫిబ్రవరిలో మొదలైన ఘర్షణలు ముగిశాయని యుఎస్ కాంగ్రెస్ కు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఏప్రిల్ ఏడవ తేదీ నుంచి అమెరికా, ఇరాన్ మధ్య ఎలాంటి దాడులు జరిగే లేదని క్లారిటీ ఇచ్చారు. 1973 నాటి వార్ పవర్స్ యాక్ట్ ప్రకారం యుద్ధం ప్రారంభమైన 60 రోజుల్లోగా కాంగ్రెస్ అనుమతి తీసుకోవాల్సిందే. అలా పర్మిషన్ తీసుకోకపోతే యుద్ధాన్ని కొనసాగించలేరు.
అయితే ఆ గడువు నిన్నటితో ముగిసింది. అటు ప్రస్తుతం సీజ్ ఫైర్ అమలులో ఉన్న తరుణంలో యుద్ధం ముగిసినట్లేనని, కాంగ్రెస్ ఆమోదం అవసరం లేదని తాజాగా డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ క్రమంలో ట్రంప్ చేసిన ఈ ప్రకటన హాట్ టాపిక్ అయింది. మరి ట్రంప్ చేసిన ఈ ప్రకటనపై ఇరాన్ సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉండగా ఇరాన్ దాడుల నుంచి రక్షణ కోసం ఇజ్రాయిల్ తన అత్యాధునిక ఐరన్ బీమ్ లేజర్ ఆయుధాన్ని UAE కి పంపినట్లు సమాచారం అందుతోంది. డ్రోన్లు, క్షిపణులను క్షణాల్లోనే కరిగించే శక్తి ఈ లేజర్ సిస్టంకు ఉంటుంది.






