ట్రంప్ శాంతి ఒప్పందం విఫలం.. థాయ్‌లాండ్‌, కంబోడియా మధ్య ఉద్రిక్తతలు

by Malleboina Mahesh |

థాయ్‌లాండ్‌, కంబోడియా మధ్య ఉద్రిక్త వాతావరణ నెలకొన్న విషయం తెలిసిందే.

ట్రంప్ శాంతి ఒప్పందం విఫలం.. థాయ్‌లాండ్‌, కంబోడియా మధ్య ఉద్రిక్తతలు
X

దిశ, వెబ్ డెస్క్: థాయ్‌లాండ్‌, కంబోడియా మధ్య ఉద్రిక్త వాతావరణ నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రంగంలోకి దిగి.. ఇరు దేశాల మధ్య పీస్ డీల్ (Peace deal) చేశాడు. కానీ థాయ్‌లాండ్‌, కంబోడియా దేశాల మధ్య సరిహద్దు వివాదం మరోసారి తీవ్ర ఉద్రిక్తతలకు (extreme tensions) దారితీసింది. వివాదాస్పదమైన ప్రీహ్ విహియార్ గుడికి దగ్గరలో ఇరు దేశాల సైన్యాలు గ్రెనేడ్ లాంచర్లు, చిన్నపాటి ఆయుధాలతో కాల్పులకు దిగారు. దీంతో థాయ్‌లాండ్‌ ఎదురుకాల్పులు జరిపి, ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఈ కాల్పుల్లో కంబోడియా ఎనిమిది బాంబులు వేసినట్టు థాయ్ మిలటరీ తెలిపింది.

మొదట ఈ ఏడాది జూలై 5న ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగింది. అక్టోబర్‌లో ఈ సరిహద్దు వివాదంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక శాంతి ఒప్పందాన్ని (పీస్ డీల్) కుదిర్చినప్పటికీ, ఈ తాజా కాల్పుల ఘటనతో ఆ ఒప్పందం విఫలమైనట్లు స్పష్టమవుతోంది. తాజా దాడుల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఇరు దేశాలు తమ సైనికులను ఆయుదాలను ఆ ప్రాంతంలో మోహరించాయి.

Next Story