భారత్‌పై మరోసారి రెచ్చిపోయిన ట్రంప్‌

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-04 16:16:34  IST  )

భారత్‌(India)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి తన అక్కసును వెళ్లగక్కారు.

భారత్‌పై మరోసారి రెచ్చిపోయిన ట్రంప్‌
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌(India)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి తన అక్కసును వెళ్లగక్కారు. భారత్‌పై మరిన్ని టారిఫ్‌లు విధిస్తామని ప్రకటించారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో ఎంతో మంది చనిపోతున్నారు. చౌకగా ఇంధనం కొంటూ రష్యాకు ఆర్థికసాయం చేస్తున్నారు. రష్యాకు భారత్‌ పూర్తిగా సహకరిస్తోందని ట్రంప్‌ ఆరోపించారు. భారత్‌ చమురును కొనుగోలు చేయడంతో.. రష్యా ఇంకా ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తోందని.. యుద్ధం వల్ల ఎంతో మంది చనిపోతున్నా భారత్‌ పట్టించుకోవడం లేదని ట్రంప్‌ ఆరోపించారు. కాగా, ఇప్పటికే భారత్‌పై 25 శాతం టారిఫ్‌‌ను ట్రంప్ విధించిన విషయం తెలిసిందే. మరోవైపు అమెరికా అధ్యక్షుడి సలహాదారు స్టీఫెన్‌ మిల్లర్‌ సైతం భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికాతో భారత్‌ నిజాయితీగా వ్యవహరించడం లేదని.. అమెరికాను మిత్రదేశంగా చెప్పుకుంటుందని.. అమెరికా వస్తువులను ఆమోదించదని.. భారీ సుంకాలను విధిస్తుందని మిల్లర్ ఆరోపించారు.

Next Story