- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జెలెన్‌స్కీతో ట్రంప్ భేటీ.. రష్యాతో శాంతి ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగించేందుకు కీలక ప్రయత్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. ఇవాళ (సోమవారం) ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసం మార్-ఎ-లాగోలో ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో యుద్ధానికి ముగింపు పలికే శాంతి ప్రణాళికపై విస్తృతంగా చర్చించినట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. సమావేశం అనంతరం ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelensky)లతో ముక్కోణపు సమావేశం జరుగుతుందా అనే ప్రశ్నకు స్పందించిన ఆయన.. ‘సరైన సమయంలో అది జరుగుతుందని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. (Putin) పుతిన్‌తో తాను గంటకు పైగా ఫోన్‌లో మాట్లాడానని, రష్యా కూడా యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటోందని ట్రంప్ చెప్పారు. శాంతి ఒప్పందం దిశగా ఇరు పక్షాల మధ్య సుమారు 90 శాతం ఏకాభిప్రాయం కుదిరిందని ట్రంప్ వెల్లడించారు. అయితే, కేవలం ప్రాంతీయ సరిహద్దుల విషయంలోనే ప్రతిష్టంభన కొనసాగుతుందని పేర్కొన్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ట్రంప్ ఫోన్..
ఈ సమావేశంలో ఉక్రెయిన్ (Ukraine) భూభాగాల భవితవ్యం, ముఖ్యంగా ప్రస్తుతం రష్యా నియంత్రణలో ఉన్న (Zaporizhzhia nuclear power plant ) జపోరిజ్జియా అణు విద్యుత్ కేంద్రం భవిష్యత్‌పై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. యుద్ధం ముగిసిన తర్వాత ఉక్రెయిన్ భద్రత, పునర్నిర్మాణ ప్రణాళికలపై కూడా ఇద్దరు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, జెలెన్‌స్కీ-ట్రంప్ భేటీకి ముందు ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో సంభాషించారు. ఆ సంభాషణ అనంతరం రష్యా మాజీ అమెరికా రాయబారి మాట్లాడుతూ.. యూరోపియన్ యూనియన్, ఉక్రెయిన్ ప్రతిపాదించిన తాత్కాలిక కాల్పుల విరమణ యుద్ధాన్ని మరింత పొడిగించవచ్చనే అభిప్రాయంలో ట్రంప్, పుతిన్ ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు.






