ఇరాన్‌తో మంచి ఒప్పందమే చేసుకుంటా: ట్రంప్

by velandi.Saikiran |

ఇరాన్‌తో మంచి ఒప్పందమే చేసుకుంటాన‌ని ప్ర‌క‌టించారు డొనాల్డ్ ట్రంప్.

ఇరాన్‌తో మంచి ఒప్పందమే చేసుకుంటా: ట్రంప్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇరాన్ వర్సెస్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు నెలకొంటున్న సంగతి తెలిసిందే. దీని ప్రభావం ప్రపంచ దేశాలపై పడింది. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే ఇలాంటి క్రమంలో ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ తో తాను ఏదైనా ఒప్పందం చేసుకుంటే అది మంచిగా.. సరైనదిగా ఉంటుందని వెల్లడించారు. తాను గతంలో ఒబామా చేసుకున్న డీలర్ లాంటిది చేయబోనని వివరించారు ట్రంప్.

ఈ ఒప్పందం ఇరాన్ కు భారీ నగదును, అణు ఆయుధాల తయారీకి మార్గాన్ని ఇచ్చింది అంటూ పేర్కొన్నారు. అయితే ఈ ఒప్పందం దానికి పూర్తిగా భిన్నం అన్నారు. దాని గురించి ఇంకా ఎవరికి తెలియదని వ్యాఖ్యానించారు. అది ఇంకా చర్చల దశకు రాలేదని క్లారిటీ ఇచ్చారు ట్రంప్. తాను కూడా బ్యాడ్ డీల్స్ చేసుకోనని వివరించారు. ఒప్పందం గురించి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఈ విధంగా స్పందించారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Next Story