హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం

by Ajay Maddhiboyina |

హెచ్ 1బీ వీసా ఎంపిక ప్ర‌క్రియ‌లో ట్రంప్ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ద‌శాబ్దాలుగా కొన‌సాగుతున్న లాట‌రీ విధానానికి స్వ‌స్తి ప‌లికింది. అధిక నైపుణ్యాలు, ఎక్కువ జీతాలు పొందేవారికి ప్రాధాన్య‌త ఇచ్చే కొత్త

హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం
X

దిశ‌, వెబ్ డెస్క్: హెచ్ 1బీ వీసా ఎంపిక ప్ర‌క్రియ‌లో ట్రంప్ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ద‌శాబ్దాలుగా కొన‌సాగుతున్న లాట‌రీ విధానానికి స్వ‌స్తి ప‌లికింది. అధిక నైపుణ్యాలు, ఎక్కువ జీతాలు పొందేవారికి ప్రాధాన్య‌త ఇచ్చే కొత్త వెయిటెడ్ విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఈ నిర్ణ‌యం అమెరిక‌న్ కార్మికుల వేత‌నాలు, ఉద్యోగ అవ‌కాశాల‌ను కాపాడ‌టానికి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ స్ప‌ష్టం చేసింది. ప్ర‌స్తుతం ఉన్న లాట‌రీ విధానాన్ని అమెరికాలోని కొన్ని కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయ‌ని.. అమెరిక‌న్ల‌తో పోలిస్తే త‌క్కువ జీతాల‌కు విదేశీయుల‌ను నియ‌మించుకునేందుకు దీనిని ఓ మార్గంగా వాడుకుంటున్నార‌ని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) అధికార ప్రతినిధి మాథ్యూ ట్రాగెసర్ ఆరోపించారు. కొత్త విధానం ద్వారా ఎక్కువ జీవితాలు, అధిక నైపుణ్యాలు ఉన్న విదేశీ ఉద్యోగుల కోసం ద‌ర‌ఖాస్తు చేసేలా కంపెనీల‌ను ప్రోత్స‌హిస్తుందని తెలిపారు. అమెరికాలో ఇది పోటీ త‌త్వాన్ని మ‌రింత పెంచుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

Next Story