- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
America: ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ.. ఆనందంలో ఆ విద్యార్థులు
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పదవి బాధ్యతలు

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విదేశీ విద్యార్థులపై బహిష్కరణ వేటు వేశారు. వివిధ కారణాలతో 187 కాలేజీలకు చెందిన దాదాపు 1200 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసా (Student Visa) లేదా వారి చట్టబద్ధ హోదాలను రద్దు చేసింది. దీంతో ఆ విద్యార్థులంతా న్యాయస్థానాలను ఆశ్రయించగా.. విచారణ జరిపిన కోర్టు ట్రంప్‌కు భారీ షాకిచ్చింది. విదేశీ విద్యార్థులకు ఊరట కల్పిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ట్రంప్ యంత్రాంగం చర్యలను న్యాయస్థానం తోసిపుచ్చింది.
ఈ క్రమంలోనే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆయా విద్యార్థుల చట్టబద్ధ హోదాను తాత్కాలికంగా పునరుద్ధరించింది. దీంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే విదేశీ విద్యార్థులపై బహిష్కరణ వేటు కారణంగా డిపోర్టేషన్, నిర్బంధం ముప్పు పొంచి ఉండటంతో ఆ విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. వీరిలో కొంతమంది ఇప్పటికే అమెరికాను వీడగా.. కొందరు రహస్య ప్రదేశాల్లో తలదాచుకున్నారు. తాజాగా కోర్టు వ్యాఖ్యలతో ట్రంప్ సర్కారు వెనక్కి తగ్గింది.






