Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

by Ajay Maddhiboyina |   (  Updated:2025-11-29 15:04:28  IST  )

వెనిజులాతో వివాదం ముదురుతున్న వేళ‌ అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. వెనిజులా గ‌గ‌న‌త‌లాన్ని పూర్తిగా మూసివేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అన్ని విమాన‌యాన సంస్థ‌లు, పైల‌ట్లు, మాద‌క‌ద్ర‌వ్యాల డీల‌ర్లు మ‌రియు మాన‌వ అక్ర‌మ ర‌వాణా దారులు ద‌య‌చేసి వెనుజులా గ‌గ‌న‌త‌లాన్ని మూసివేసిన‌ట్టు గ‌మ‌నించాల‌న్నారు.

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
X

దిశ‌, వెబ్ డెస్క్: వెనిజులాతో వివాదం ముదురుతున్న వేళ‌ అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. వెనిజులా గ‌గ‌న‌త‌లాన్ని పూర్తిగా మూసివేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అన్ని విమాన‌యాన సంస్థ‌లు, పైల‌ట్లు, మాద‌క‌ద్ర‌వ్యాల డీల‌ర్లు మ‌రియు మాన‌వ అక్ర‌మ ర‌వాణా దారులు ద‌య‌చేసి వెనుజులా గ‌గ‌న‌త‌లాన్ని మూసివేసిన‌ట్టు గ‌మ‌నించాల‌న్నారు. కాగా నిన్న ట్రంప్ వెనిజులా మాద‌క‌ద్ర‌వ్యాల అక్ర‌మ ర‌వాణాను రోడ్డు మార్గం ద్వారా ఆప‌డానికి ప్ర‌య‌త్నాలు అతిత్వ‌ర‌లో ప్రారంభం అవుతాయ‌ని చెప్పారు.

అంతే కాకుండా స‌ముద్రం ద్వారా దాదాపు 85శాతం డ్ర‌గ్స్ అక్ర‌మ‌ర‌వాణా ఆగిపోయింద‌న్నారు. ఇక నేడు ఎక్స్ పోస్టు ద్వారా వెనిజులా గ‌గ‌న‌త‌లాన్ని మూసివేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇదిలా ఉంటే అమెరికాలోకి డ్ర‌గ్స్ అక్ర‌మ‌ర‌వాణాను పూర్తిగా నిలిపివేసేందుకు అమెరికా క‌రేబియ‌న్ దీవుల్లో త‌మ ఆర్మీని మోహ‌రించింది. అంతే కాకుండా వెనిజులా అధ్య‌క్షుడు నికోల‌స్ మ‌దురో మాద‌క‌ద్ర‌వ్యాల వ్యాపారం చేస్తున్నాడ‌ని అమెరికా ఆరోపించింది. దీంతో ఇరు దేశాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

Next Story