Morocco Earthquake : విషాదం.. 296 మంది దుర్మరణం

by Sathputhe Rajesh |   (  Updated:2023-09-09 05:10:23  IST  )

మొరాకోలో భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Morocco Earthquake : విషాదం.. 296 మంది దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: మొరాకోలో భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భూకంప ధాటికి మొత్తం 296 మంది దుర్మరణం చెందారు. 6.8 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. ఈ ఘటనపై మొరాకో అంతర్గత మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. శనివారం వేకువజామున సంభవించిన భూకంపంలో 296 మంది మరణించారని తెలిపింది. మరో153 మందికి తీవ్ర గాయాలయ్యాయని వీరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. శతాబ్ధ కాలంలో ఉత్తర ఆఫ్రికా ఈ స్థాయి భూకంపాన్ని చూడలేదని జియాలజికల్ సర్వే వెల్లడించింది. భూకంప ధాటికి ఒక్క సారిగా భవనాలు కదలడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. ప్రధాని మోడీ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన సంతాపాన్ని తెలిపారు.

Next Story