heavy rains: ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు: 25 మంది మృతి

by Shamantha N |

ఈశాన్య రాష్ట్రాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలకు వరదలు పోటెత్తడంతో 25 మంది వరకు మరణించారు. అధికారిక సమాచారం ప్రకారం.. అస్సాం రాజధాని గౌహతి (gowhathi) లో మట్టి కూరుకుపోయి ఐదుగురు చనిపోయారు.

heavy rains: ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు: 25 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈశాన్య రాష్ట్రాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలకు వరదలు పోటెత్తడంతో 25 మంది వరకు మరణించారు. అధికారిక సమాచారం ప్రకారం.. అస్సాం రాజధాని గౌహతి (gowhathi) లో మట్టి కూరుకుపోయి ఐదుగురు చనిపోయారు. అందులో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నారు. గోలాఘాట్, లక్ష్మీపుర్ జిల్లాల్లో వరదల కారణంగా మరో ముగ్గురు మృతి చెందారు. అరుణాచల్ ప్రదేశ్‌లో ఒక వాహనం వరద నీటిలో కొట్టుకుపోయిన ఘటనలో ఏడుగురు మరణించగా, మరో ఇద్దరు వేర్వేరు ఘటనల్లో మునిగి చనిపోయారు. ఈ రాష్ట్రంలో మొత్తం తొమ్మిది మంది మృతి చెందారు. మిజోరం, త్రిపురా, మేఘాలయ రాష్ట్రాల్లో గత 24 గంటల్లో ఎనిమిది మంది మృతి చెందారు. వరదలే దీనికి కారణమని అధికారులు పేర్కొన్నారు. మణిపూర్‌లో మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల వల్ల ఇంఫాల్ నగర జీవితం స్తంభించింది. ఇంఫాల్ నది ఒడ్డున నివసిస్తున్నవారికి అధికారులు తరలిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు.

ఉత్తర సిక్కింలో చిక్కుకున్న 1500 మంది పర్యాటకులు

ఉత్తర సిక్కిం (north sikkim) లో సుమారు 1,500 మంది పర్యాటకులు భారీ వర్షాల వల్ల అక్కడే చిక్కుకుపోయారు. మంగన్ జిల్లాలో తిస్తా నదిలో పర్యాటకులు ప్రయాణిస్తున్న వాహనం పడిపోవడంతో ఒకరు మృతి చెందారు. ఇద్దరు గాయపడ్డారు. మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. అస్సాంలో భారీ వర్షాల వల్ల 17 జిల్లాలు ప్రభావితమయ్యాయి. లక్ష్మిపూర్ ఒక్క జిల్లాలోనే ఏకంగా 40 వేల మందికి పైగా వరద బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా వాతావరణ శాఖ మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Next Story