- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నన్ను చూసి భారత్ వణుకుతోంది : పహల్గామ్ దాడి సూత్రధారి ప్రగల్భాలు
by Naga Rani Yarlagadda |
తనను చూసి భారత్ వణుకుతోందని లష్కరే తోయిబా (LeT) టాప్ లీడర్, పహల్గామ్ ఉగ్రదాడి మాస్టర్ మైండ్ సైఫుల్లా కసూరి ప్రగల్భాలు పలికాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: తనను చూసి భారత్ వణుకుతోందని లష్కరే తోయిబా (LeT) టాప్ లీడర్, పహల్గామ్ ఉగ్రదాడి మాస్టర్ మైండ్ సైఫుల్లా కసూరి ప్రగల్భాలు పలికాడు. భారత్ ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్లో ఉన్న పంజాబ్ ప్రావిన్స్ లో జరిగిన కార్యక్రమంలో స్టూడెంట్స్ ను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్ మిషన్ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని చెప్పుకొచ్చాడు. పాక్ ఆర్మీనే తనను స్వయంగా ఆహ్వానిస్తుందని చెప్పడంతో.. అంతర్జాతీయ సమాజం ముందు టెర్రరిజంపై పోరాడుతున్నామని చెప్తున్న పాక్ ముసుగును తొలగించినట్లయింది. యుద్ధంలో మరణించిన పాక్ సైనికులకు అత్యంక్రియల ప్రార్థనలు తానే చేస్తానని సైఫుల్లా పేర్కొనడంతో.. అక్కడి సైన్యం - ఉగ్రవాదుల మధ్య ఎంత బలమైన సంబంధం ఉందో వెల్లడైంది.
Next Story






