- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లష్కరే తొయిబా టాప్ టెర్రరిస్టు ఖలీద్ హతం
by Gantepaka Srikanth |
లష్కరే తొయిబా(Lashkar-e-Taiba) టాప్ టెర్రరిస్టు(Terrorists) సైఫుల్లా ఖలీద్(Saifullah Khalid) మృతిచెందాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: లష్కరే తొయిబా(Lashkar-e-Taiba) టాప్ టెర్రరిస్టు(Terrorists) సైఫుల్లా ఖలీద్(Saifullah Khalid) మృతిచెందాడు. పాకిస్తాన్‌లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఖలీద్‌ను కాల్చి చంపారు. ప్రస్తుతం లష్కరే లాంచ్ కమాండర్లతో కలిసి సైఫుల్లా ఖలీద్ పని చేస్తున్నారు. ఉగ్రవాదులు నేపాల్ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ఖలీద్ సాయం చేస్తూ వస్తున్నారు. 2006లో నాగపూర్ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంపై దాడి వెనక ఖలీద్ ఉన్న సంగతి తెలిసిందే. 2005 ఐఐఎస్సీ క్యాంపస్ దాడి వెనక కూడా ఖలీద్ పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2001 రాంపూర్ సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై దాడి ఘటనలోనూ సైఫుల్లా ఖలీద్ నిందితుడిగా ఉన్నారు. చాలా కాలం పాటు నేపాల్‌లో ఉంటూ లష్కరే కార్యకలాపాలు నిర్వహించిన ఖలీద్.. ఇటీవల సింధ్ ప్రావిన్స్‌లోని బాదిక్ జిల్లాకు మకాం మార్చాడు. అనూహ్యంగా ఇవాళ హతమయ్యారు.
Next Story






