PM Modi: ప్రధానిని కలవాలంటే ఇక ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సిందే

by Shamantha N |   (  Updated:2025-06-11 07:15:08  IST  )

దేశంలో కొవిడ్ (Corona virus) కేసుల సంఖ్య 7వేలు దాటింది. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీని కలవాలనుకునే మంత్రులు, ప్రభుత్వ అధికారులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్‌ (RT-PCR) పరీక్ష చేయించుకోవాలని ప్రధాన మంత్రి కార్యాలయం సూచనలు జారీ చేసింది.

PM Modi: ప్రధానిని కలవాలంటే ఇక ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సిందే
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో కొవిడ్ (Corona virus) కేసుల సంఖ్య 7వేలు దాటింది. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీని కలవాలనుకునే మంత్రులు, ప్రభుత్వ అధికారులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్‌ (RT-PCR) పరీక్ష చేయించుకోవాలని ప్రధాన మంత్రి కార్యాలయం సూచనలు జారీ చేసింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం రిలీజ్ చేసి డేటా ప్రకారం.. 24 గంటల్లో దేశంలో 306 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కరోనా కేసులు 7121 ఉన్నాయి. కొవిడ్ మృతులు 74కు చేరారు.

కేరళలో అత్యధికంగా కేసులు..

కేరళలో కొవిడ్ యాక్టివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కేరళలో ప్రస్తుతం 2,223 యాక్టివ్ కేసులు ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఉన్నట్లు పేర్కొన్నారు. కరోనా కొత్త వేరియంట్లపై ప్రస్తుతానికి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇన్ఫెక్షన్‌ బారిన పడకుండా మాస్కు పెట్టుకోవడం, శానిటైజర్ యూజ్ చేయడం వల్ల ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు. గుజరాత్‌ 1,223, దిల్లీ 757, పశ్చిమబెంగాల్ 747, మహారాష్ట్ర 615, కర్ణాటక 459, ఉత్తరప్రదేశ్‌ 229, తమిళనాడు 204, రాజస్థాన్‌ 138, హరియాణా 125, ఆంధ్రప్రదేశ్‌ 72 లలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

Next Story