యాపిల్ సీఈఓ పదవికి టిమ్ కుక్ రాజీనామా..అత‌నికి బాధ్య‌త‌లు!

by velandi.Saikiran |   (  Updated:2026-04-21 00:05:55  IST  )

టిమ్ కుక్ స్థానంలో జాన్ టెర్నెస్..యాపిల్ సీఈఓగా బాధ్య‌త‌లు తీసుకుంటారు.

యాపిల్ సీఈఓ పదవికి టిమ్ కుక్ రాజీనామా..అత‌నికి బాధ్య‌త‌లు!
X

దిశ‌, వెబ్ డెస్క్: టెక్ దిగ్గజం యాపిల్ సమూల మార్పులకు సిద్ధమైంది. తమ సంస్థ సీఈఓగా సుదీర్ఘ కాలం సేవలు అందించిన టిమ్ కుక్... తన పదవికి రాజీనామా చేయనున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. సెప్టెంబర్ ఒకటో తేదీన తన పదవికి రాజీనామా చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇక టిమ్ కుక్ రాజీనామా చేస్తే అతని స్థానంలో యాపిల్ ప్రస్తుత సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ టెర్నెస్ నూతన సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. స్టీవ్ జాబ్స్ తర్వాత యాపిల్ ను ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా తీర్చిదిద్దరంలో టిమ్ కుక్ కీలక పాత్ర పోషించాడ‌న్న సంగతి తెలిసిందే. 15 ఏళ్ల పాటు యాపిల్ ను విజ‌య‌ప‌థంలో న‌డిపించిన టిమ్ కుక్‌... ఇక‌పై సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మ‌న్‌గా కొన‌సాగుతాడు.

కొత్త సీఈఓ ఎవ‌రంటే ?

టిమ్ కుక్ స్థానంలో జాన్ టెర్నెస్..యాపిల్ సీఈఓగా బాధ్య‌త‌లు తీసుకుంటారు. ఇత‌ను ప్ర‌స్తుతం హార్డ్ వేర్ ఇంజ‌నీరింగ్ సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ గా ప‌ని చేస్తున్నారు. ఐఫోన్‌, మాక్‌, ఐప్యాడ్, యాపిల్ వాచ్ లాంటి పాపుల‌ర్ ఎల‌క్ట్రానిక్స్ డెవ‌ల‌ప్‌మెంట్ లో కీల‌క పాత్ర పోషించారు.

Next Story