- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడు భారత సముద్ర జలాల తీరాల్లో ముగ్గురు అనుమానాస్పద వ్యక్తుల అరెస్టు
సముద్ర మార్గం ద్వారా భారత్ లోకి అక్రమంగా ప్రవేశించాలనుకున్న ముగ్గురు వ్యక్తులను తమిళనాడులో భారత తీర రక్షక దళం అరెస్టు చేసింది. వీరు శ్రీలంకకు చెందిన వారని గుర్తించారు.

దిశ, నేషనల్ బ్యూరో: సముద్ర మార్గం ద్వారా భారత్ లోకి అక్రమంగా ప్రవేశించాలనుకున్న ముగ్గురు వ్యక్తులను తమిళనాడులో భారత తీర రక్షక దళం అరెస్టు చేసింది. వీరు శ్రీలంకకు చెందిన వారని గుర్తించారు. ఇద్దరు సింహళీలు, ఒకరు శ్రీలంక తమిళియన్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో తీర ప్రాంతాల్లో కోస్ట్ గార్ట్స్ మరింత నిఘాను ఏర్పాటు చేసింది. భారత్-శ్రీలంక మధ్య ఉండే సముద్ర మార్గంలోని సహజంగా ఏర్పడిన ఇసుక మట్టిలపై హోవర్‌క్రాఫ్ట్‌లతో గస్తీ ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు అక్కడ ఉండటాన్ని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు.
తమిళనాడు కోస్ట్ గార్డ్ ప్రాంతంలో తీవ్ర నిఘా
వీరు తమిళనాడు నుంచి యూరప్ వెళ్లే ప్రణాళికతో ఇండిాయా తీర ప్రాంతానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో కబిలన్ అనే వ్యక్తి డ్రగ్స్ కు సంబంధించిన కేసులో ఇప్పటికే అరెస్టు అయి బెయిల్ పై బయట ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇదే తరహాలో శ్రీలంక కోస్ట్ గార్డ్, క్రిమినల్ నేపథ్యం కలిగిన ఇమ్మానుయేల్ ముషాబ్, అజిథన్ అనే ఇద్దరిని తమిళనాడులోకి చొరబడే ప్రయత్నంలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అరెస్టైన ముగ్గురు వ్యక్తులను రాష్ట్ర మెరైన్ పోలీస్‌కి మణడపం వద్ద అప్పగించారు. తమిళనాడు తీర ప్రాంతాల్లో అక్రమ చొరబాట్లను నిరోధించేందుకు కోస్ట్ గార్డ్ పటిష్ట నిఘా కొనసాగిస్తుంది.






