BREAKING: భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం

by Naga Rani Yarlagadda |

అమెరికన్ విశ్వ విద్యాలయాలకు చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతులు లభించాయి.

BREAKING: భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికన్ విశ్వ విద్యాలయాలకు చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతులు లభించాయి. క్వాంటమ్ మెకానిక్స్ పై జాన్ క్లార్క్, మైఖేల్ హెచ్.డెవోరెట్, జాన్ ఎం మార్టినిస్ లు చేసిన కృషికి గాను 2025లో నోబెల్ పురస్కారం అందుకోనున్నారు. ఎలక్ట్రిక్ సర్క్యూట్లో మాక్రోస్కోపిక్ క్వాంటం మెకానికల్ టన్నెలింగ్, ఎనర్జీ క్వాంటైజేషన్లో ఆవిష్కరణలకు గుర్తింపుగా స్టాక్ హోమ్ లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారాలను ప్రకటించింది.

కాగా.. నిన్న (సోమవారం) వైద్యరంగంలో నోబెల్ పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే. మేరీ ఇ.బ్రంకో, ఫ్రెడ్ రామ్స్ డెల్, షిమన్ సకగుచీలకు నోబెల్ పురస్కారం దక్కింది. కాగా.. ఈనెల 13వ తేదీ వరకూ వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులకు నోబెల్ పురస్కారాలను ప్రకటించనున్నారు. బుధవారం రసాయనశాస్త్రం, గురువారం సాహిత్యం విభాగాల్లో విజేతలను ప్రకటించనున్నారు.

Next Story