Air India: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై.. ముగ్గురు ఆఫీసర్ల తొలగింపు

by Shamantha N |

అహ్మదాబాద్‌లో జూన్ 12న జరిగిన ఘోర విమాన ప్రమాదం తర్వాత, ఏయిర్ ఇండియా సిబ్బంది షెడ్యూలింగ్‌లో తీవ్రమైన భద్రతా లోపాలు చోటుచేసుకున్నట్లు గుర్తించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), సంస్థపై కఠిన చర్యలు తీసుకుంది.

Air India: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై.. ముగ్గురు ఆఫీసర్ల తొలగింపు
X

దిశ, నేషనల్ బ్యూరో: అహ్మదాబాద్‌లో జూన్ 12న జరిగిన ఘోర విమాన ప్రమాదం తర్వాత, ఏయిర్ ఇండియా సిబ్బంది షెడ్యూలింగ్‌లో తీవ్రమైన భద్రతా లోపాలు చోటుచేసుకున్నట్లు గుర్తించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), సంస్థపై కఠిన చర్యలు తీసుకుంది. సిబ్బంది లైసెన్సింగ్, విశ్రాంతి, రీసెన్సీ నిబంధనలను ఉల్లంఘిస్తూ అనుమతులు లేని షెడ్యూలింగ్ చేసినట్లు డీజీసీఏ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఏయిర్ ఇండియాలోని రోస్టరింగ్ విభాగానికి చెందిన ముగ్గురు అధికారులను బాధ్యతల నుంచి తొలగించారు. చూరా సింగ్ (డివిజనల్ వైస్ ప్రెసిడెంట్), పింకీ మిత్తల్ (చీఫ్ మేనజర్ డీవోపీఎస్ క్రూ షెడ్యూలింగ్) పాయల్ అరోరా (క్రూ షెడ్యూలింగ్ అండ్ ప్లానింగ్ ) సిబ్బందిని బాధ్యతల నుంచి తొలగించాలని ఆదేశించింది. దీంతో పాటు వీరిపై అంతర్గతంగా విచారణ ప్రారంభించాలని మేనేజ్‌మెంట్‌ను డీజీసీఏ కోరింది.

భద్రతా ప్రమాణాలపై దృష్టి సారించాలి

275 మంది ప్రాణాలు కోల్పోయిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేయగా, ఈ ఘటనలో 241 మంది ప్రయాణికులు సిబ్బంది మృతి చెందారు. కేవలం ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ కూడా చనిపోయారు. విమానం వారి హాస్టల్ భవనంపై కూలిపోయింది. ఈ ఘటన అనంతరం విమానయాన రంగంలో భద్రతా ప్రమాణాలపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని కోర్టు, విమాన భద్రతాధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో షెడ్యూలింగ్ నిబంధనల్లో ఏవైనా ఉల్లంఘనలు పునరావృతమైతే, డీజీసీఏ తీవ్ర శిక్షలు విధిస్తుందని తెలిపింది.

Next Story