ఏడు రాష్ట్రాల్లో పెట్టుబడుల పేరుతో వేల కోట్లలో మోసం

by Shamantha N |

మధ్యప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) దేశవ్యాప్తంగా రూ. 2,283 కోట్ల మేర ఉన్న భారీ పెట్టుబడి మోసం బహిర్గతం చేసింది.

ఏడు రాష్ట్రాల్లో పెట్టుబడుల పేరుతో వేల కోట్లలో మోసం
X

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) దేశవ్యాప్తంగా రూ. 2,283 కోట్ల మేర ఉన్న భారీ పెట్టుబడి మోసం బహిర్గతం చేసింది. ఈ కేసులో కీలక నిందితులు దీపక్ శర్మ, మదన్ మోహన్ కుమార్‌ను ఢిల్లీలో అరెస్ట్ చేశారు. BotBro అనే ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫాంల పేరుతో (Yorker FX) , (Yorker Capital) అనే షెల్ కంపెనీల ద్వారా మోసాలకు పాల్పడ్డారు. ఏడు రాష్ట్రాల్లో వేలాది మంది పెట్టుబడులు పెట్టి మోసపోయారు.ఇండోర్ కు చెందిన ఇషాన్ సలూజా అనే వ్యక్తి,కి రూ. 20.18 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు 6–8 శాతం లాభం వస్తుందని హామీ ఇచ్చారు. దీంతో అనుమానించిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కుంభకోణం బయటపడింది.

దర్యాప్తులో విస్తుపోయే విషయాలు

దర్యాప్తులో భాగంగా నిందితులు రైనేట్ టెక్నాలజీ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ (Rainet Technology Pvt Ltd) , (Kindent Business Solutions Pvt Ltd ) అనే కంపెనీల ఖాతాల్లో పెట్టుబడిదారుల డబ్బును స్వీకరించి, ఆ మొత్తాన్ని అమెరికన్ డాలర్లుగా మార్చి Meta-5 అకౌంట్ల ద్వారా ఫారెక్స్ ట్రేడింగ్‌కు వాడినట్టు గుర్తించారు. STF ఇప్పటికే 20కి పైగా అనుమానాస్పద బ్యాంకు ఖాతాల్లోని సుమారు రూ. 90 కోట్లను ఫ్రీజ్ చేసింది. దర్యాప్తులో మరో కీలక విషయం బయటపడింది. (Kindent Business Solutions Pvt Ltd, 2023-24 ఆర్థిక సంవత్సరానికి MCA (Ministry of Corporate Affairs)కి రూ. 1.10 కోట్ల ట్రయల్ బ్యాలెన్స్ చూపింది. కానీ 2023 జనవరి నుంచి 2024 డిసెంబర్ మధ్య కాలంలో సంస్థ బ్యాంకు ఖాతాల్లో లావాదేవీలు రూ. 7,020 కోట్ల మేర జరిగినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. రైనేట్ టెక్నాలజీ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ రూ. 7.80 కోట్ల ట్రయల్ బలాన్స్ ప్రకటించగా, బ్యాంకు లావాదేవీలు రూ. 15,800 కోట్లకు పైగా ఉన్నట్లు తేలింది. ఈ రెండు సంస్థల ఖాతాల్లో కలిపి రూ. 22,830 కోట్ల వరకు డబ్బు వచ్చి, ఆ తర్వాత గుర్తుతెలియని ఇతర ఖాతాల్లోకి బదలాయించినట్లు గుర్తించారు. ఈ సంస్థలు ఆర్బీఐ, సెబీ వద్ద రిజిస్ట్రేషన్ లేకుండానే పనిచేశాయని గుర్తించారు. ఈ కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా (FEMA) చట్టం కింద విచారణ జరుపుతోంది. మోసపూరితంగా పనిచేసిన BotBro వెబ్‌సైట్‌ను ఇప్పటికే ఆఫ్‌లైన్‌ చేశారు. నిందితులు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ మరియు అస్సాం రాష్ట్రాల్లో ప్రజలను మోసగించినట్టు అంగీకరించారు.

Next Story