- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిజజీవితంలో డోరేమాన్ ఇల్లు ఇదే! జపాన్ వీధుల్లో అచ్చం నోబితా ఊరు వీడియో వైరల్
పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ అలరించిన పాపులర్ జపనీస్ కార్టూన్ షో ‘డోరేమాన్’. అందులో నోబితా ఇల్లు, ఆ ఇరుకైన వీధులు, స్కూల్ కు వెళ్లే దారి.. ఇవన్నీ మన మనసుల్లో ముద్రపడిపోయాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ అలరించిన పాపులర్ జపనీస్ కార్టూన్ షో ‘డోరేమాన్’ (Doraemon). అందులో నోబితా ఇల్లు, ఆ ఇరుకైన వీధులు, స్కూల్ కు వెళ్లే దారి.. ఇవన్నీ మన మనసుల్లో ముద్రపడిపోయాయి. అయితే ఆ కార్టూన్ ప్రపంచం నిజజీవితంలో ఎక్కడైనా ఉందా? అంటే.. ఉందని అంటున్నాడు ఓ భారతీయ కంటెంట్ క్రియేటర్. ఆ లొకేషన్లను ప్రత్యక్షంగా చూపిస్తూ నెటిజన్లను చిన్ననాటి మధురస్మృతుల్లోకి తీసుకెళ్లాడు.
6 వేల కిలోమీటర్ల ప్రయాణం..
సార్థక్ సచ్‌దేవా (Sarthak Sachdeva) అనే ఇండియన్ ఇన్‌ఫ్లుయెన్సర్, డోరేమాన్, నోబితాల ఇంటికి అసలైన స్ఫూర్తిగా నిలిచిన జపాన్‌లోని ఒక ప్రశాంతమైన నివాస ప్రాంతాన్ని చూసేందుకు ఇండియా నుండి ఏకంగా 6 వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. దానికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు. ‘కేవలం ఈ ఇంటిని చూడటానికే నేను ఇండియా నుండి జపాన్ వచ్చాను’ అని ఉత్సాహంగా చెబుతూ అతడు ఈ వీడియోను ప్రారంభించాడు.
అచ్చం నోబితా నడిచిన వీధులే..
ఆ వీడియోలో సార్థక్ జపాన్ వీధుల్లో నడుస్తూ.. ఇరుకైన వీధులు, చిన్న చిన్న ఇళ్లు, ప్రశాంతమైన రోడ్లను చూపించాడు. ‘కార్టూన్‌లో నోబితా ప్రతిరోజూ స్కూల్‌కు, గ్రౌండ్‌లో ఆడుకోవడానికి నడిచి వెళ్లే దారి కచ్చితంగా ఇదే’ అంటూ ఆ ప్రదేశాలను అభిమానులకు పరిచయం చేశాడు. ఆ ప్రాంతంలోని వాతావరణం, పరిశుభ్రమైన వీధులు చూస్తుంటే.. కేవలం ఒక టూరిస్ట్ ప్లేస్‌ను చూసినట్లు కాకుండా, నేరుగా డోరేమాన్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుందని నెటిజన్‌లు కామెంట్స్ చేస్తు్న్నారు.
ఎమోషనల్ అవుతున్న అభిమానులు
‘రియల్ లైఫ్ డోరేమాన్ లొకేషన్స్’ అంటూ సార్థక్ పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ముఖ్యంగా స్కూల్ నుంచి రాగానే టీవీల ముందు కూర్చుని డోరేమాన్ చూస్తూ పెరిగిన మిలీనియల్స్ ప్రేక్షకులను ఈ వీడియో తీవ్రంగా భావోద్వేగానికి గురిచేస్తోంది. నెటిజన్లు ఈ వీడియోపై స్పందిస్తూ.. ఇది తమ కల (Dream) అని, ఎప్పటికైనా ఆ ప్రదేశాన్ని చూడాలనేది తమ ‘ట్రావెల్ బకెట్ లిస్ట్’లో చేరిపోయిందని కామెంట్లు పెడుతున్నారు. నోబితా, షిజుక, జియాన్, సునియోల అల్లరిని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. మొత్తానికి ఈ ఒక్క వీడియో ఎంతోమంది భారతీయులను వారి బాల్యంలోకి తీసుకెళ్లింది.






