- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికా సంచలన నిర్ణయాలు.. ట్రంప్, మస్క్కు వ్యతిరేకంగా అతి పెద్ద నిరసనలు
ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి అనేక సంచలన నిర్ణయాలను తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచ దేశాలపై ట్రంప్ విధిస్తున్న ప్రతికార సుంకాలు, టారిఫ్‌ల కారణంగా అమెరికా స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది.

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి ట్రంప్ (Trump) ఎన్నికైనప్పటి నుంచి అనేక సంచలన నిర్ణయాలను (Sensational decisions) తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచ దేశాలపై ట్రంప్ విధిస్తున్న ప్రతికార సుంకాలు, టారిఫ్‌ల కారణంగా అమెరికా స్టాక్ మార్కెట్ల (US stock markets)పై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ట్రంప్ నిర్ణయాలతో అమెరికాలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతుందన్న అంచనాలు ఎక్కువచ్చాయి. ముందుచూపు లేకుండా ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాల వల్ల.. వాణిజ్య యుద్ధాలు (Trade wars) పెరుగుతాయని అక్కడి ప్రజలు భయపడుతున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు పై ఏకమైన అమెరికా పౌరులు (American citizens) ఈ రోజు నిరసన (protest) వ్యక్తం చేసేందుకు రోడ్లపైకి వచ్చారు. ఈ ర్యాలీలు "హ్యాండ్స్ ఆఫ్!" పేరుతో అమెరికా దేశవ్యాప్తంగా 1,200 పైగా ప్రదేశాలలో నిర్వహిస్తున్నారు.
ఈ నిరసనలలో పాల్గొన్న వేలాది మంది ట్రంప్ అధ్యక్ష పాలన (Trump's presidency)లో తీసుకుంటున్న నిర్ణయాలను, మస్క్ నేతృత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (DOGE) చేపడుతున్న ప్రభుత్వ ఉద్యోగాల కోతలు, సామాజిక భద్రతా కార్యక్రమాలపై కోతలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తున్నారు. "ట్రంప్ గో బ్యాక్", "హాండ్స్ ఆఫ్ డెమోక్రసీ", "మస్క్ వాస్ నాట్ ఎలెక్టెడ్" వంటి నినాదాలతో వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, చికాగో, మయామీ వంటి ప్రధాన నగరాల్లో స్టేట్ క్యాపిటల్ భవనాలు, ఫెడరల్ కార్యాలయాల వద్ద ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ నిరసనలు ట్రంప్ పాలనలో అమలు చేస్తున్న వలస వ్యతిరేక విధానాలు, పర్యావరణ నిబంధనల రద్దు. మస్క్ చేతిలో ప్రభుత్వ డేటా గోప్యతపై ఆందోళనలను కేంద్రీకరించాయి. కాగా ఈ రోజు తలపెట్టిన ఈ నిరసనలు ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అతి పెద్ద నిరసనగా తెలుస్తుంది.






