India-Pak: భారత్ పాకిస్థాన్ యుద్ధం జరిగితే పాకిస్థాన్ కు మద్దతుగా నిలిచే దేశాలు ఇవే...

by Vennela |

India-Pak: భారత్- పాకిస్తాన్ ఓవైపు సమర సన్నాహాలు పూరిస్తూ ఉంటే, రాకుండా బాలేదుమరోవైపు యావత్ ప్రపంచం కూడా ఈ యుద్ధం ఎటువైపు సాగుతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

India-Pak: భారత్ పాకిస్థాన్ యుద్ధం జరిగితే పాకిస్థాన్ కు మద్దతుగా నిలిచే దేశాలు ఇవే...
X

దిశ, వెబ్ డెస్క్:India-Pak: భారత్- పాకిస్తాన్ ఓవైపు సమర సన్నాహాలు పూరిస్తూ ఉంటే, రాకుండా బాలేదుమరోవైపు యావత్ ప్రపంచం కూడా ఈ యుద్ధం ఎటువైపు సాగుతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అంతర్జాతీయ సమాజంలో చూస్తున్నట్లయితే భారతదేశానికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ చేసిన దుశ్చర్య మానవత్వానికి మాయని మచ్చ అని ఇప్పటికే పలు దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. అమెరికాతో పాటు యూరప్ సమాజం కూడా భారత్ పై జరిగిన ఉగ్రవాద దాడిని అమాన వీయమైన చర్యగా ఖండించాయి. అయితే అటు పాకిస్తాన్ కి కూడా మద్దతు తక్కువ ఏమీ లేదని చెప్పవచ్చు.పాకిస్తాన్ వైపు కూడా కొన్ని దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. వీరికి భారతదేశంతో గతంలో కొన్ని సందర్భాల్లో విభేదాలు ఉన్నరీత్య వారు పాకిస్థాన్ తో ఎక్కువగా అంట కాగుతున్నారు. అలాంటి దేశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

చైనా :

భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగినట్లయితే చైనా పాకిస్తాన్ వైపు నిలబడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇరుదేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీనికి తోడు పహల్గామ్ ఉగ్ర దాడి జరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ కోరిన అంతర్జాతీయ దర్యాప్తును చైనా సమర్ధించింది.

తుర్కియే:

అంతర్జాతీయంగా తుర్కియే వాళ్ళు సందర్భాల్లో భారత్ కు వ్యతిరేకంగా నిలిచింది. కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు సైతం మద్దతు తెలిపింది. ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ కు మద్దతుగా పలుమార్లు తుర్కి నిలిచింది.

అజర్ బైజాన్:

పాకిస్తాన్ కు బలంగా మద్దతు ఇచ్చే దేశాల్లో అజార్ బైజాన్ కూడా ఒకటి. ఈ దేశం కాశ్మీర్ పైన ఐక్యరాజ్యసమితిలో పలుమార్లు పాకిస్తాన్ కు మద్దతుగా నిలిచింది. అంతేకాదు పాకిస్తాన్ తో స్నేహ సంబంధాలను కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగినట్లయితే పాకిస్తాన్ కు అజర్ బైజాన్ మద్దతుగా నిలిచే అవకాశం ఉంది.

బంగ్లాదేశ్:

ప్రస్తుతం భారతదేశంలో అంతగా సఖ్యతలేని బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ కు మద్దతుగా నిలిచి అవకాశం కనిపిస్తున్నట్లు అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభంలో భాగంగా అక్కడ మారిన ప్రభుత్వం భారత్ కు అనుకూలంగా లేదు. కనుక ఈ దాయాది దేశం కూడా మనకు వ్యతిరేకంగా నిలిచి అవకాశం ఉంటుందని అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు.

మరోవైపు పాకిస్తాన్ కు అండగా ముస్లిం లీగ్ దేశాలు కూడా వంతపడే అవకాశం ఉందని విదేశాంగనిపుణులు పేర్కొంటున్నారు. లేకపోతే వీరు తటస్థ వైఖరి సైతం తీసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే సౌదీ అరేబియా, అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు మాత్రం భారత్ తో ఉన్న సన్నిహిత సంబంధాలు అయితే పాకిస్తాన్ కు మద్దతు ఇవ్వకపోవచ్చు అని నిపుణులు పేర్కొంటున్నారు.

Next Story