- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Pass Port: మోస్ట్ పవర్‌ఫుల్ దేశాల పాస్ పోర్టు జాబితా విడుదల.. భారత్ స్థానం ఎంతంటే?

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే పాస్ పోర్టు, వీసాలు తప్పనిసరి. అయితే, కొన్ని దేశాల పాస్ పోర్టులతో పలు దేశాలకు వీసాలు లేకుండా కూడా వెళ్లొచ్చు. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) అందించిన వివరాల ఆధారంగా హెన్లీ అండ్ పార్ట్ నర్స్ ఇండెక్స్ ఏటా ప్రపంచంలోని శక్తివంతమైన పాస్ పోర్ట్‌ల జాబితాను వెల్లడిస్తుంది. తాజాగా ఈ ఏడాదికి సంబంధించిన జాబితాను విడుదల చేసింది. ఇక ఈ జాబితాలో సింగపూర్ పాస్ పోర్టు అగ్రస్థానంలో నిలిచింది. ఈ పాస్ పోర్టుతో 193 దేశాల్లో వీసా లేకుండానే ప్రయాణించవచ్చు.
ఈ జాబితాలో రెండో స్థానంలో సౌత్ కొరియా, జపాన్ ఉన్నాయి. ఈ దేశాల పాస్ పోర్ట్‌లతో 190 దేశాలకు వీసా లేకుండా వెళ్లి రావచ్చు. మూడో స్థానంలో స్పెయిన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, ఫిన్ ల్యాండ్, డెన్మార్క్ దేశాలు ఉన్నాయి. ఈ దేశాల పాస్ పోర్టులు ఉన్న వారు 187 దేశాల్లో వీసా రహిత ప్రయాణం చేసేందుకు వీలుంది. ఇక హెన్లీ అండ్ పార్ట్ నర్స్ ఇండెక్స్ అందించిన సర్వే ప్రకారం.. భారత్ పాస్టు పోర్టు 80వ స్థానంలో ఉంది. ఇదే స్థానంలో అల్జీరియా, ఈక్వెటోరియల్ గినియా, తజికిస్థాన్ ఉన్నాయి. పక్కనే ఉన్న మయన్మార్ 88వ స్థానంలో ఉండంగా, శ్రీలంక 91వ స్థానం, బంగ్లాదేశ్ 93వ స్థానం, నేపాల్ 94వ స్థానం, యెమెన్ 96 స్థానం, ఆఫ్గనిస్థాన్ 99వ స్థానం, ఇరాక్ 97వ స్థానం, సిరియా 98వ స్థానాల్లో ఉన్నాయి.
వీసా లేకుండా భారతీయులు ఏ దేశాల్లోకి ప్రవేశించవచ్చు అంటే..
మలేషియా, మాల్దీవులు, మార్షల్ దీవులు, మారిషస్, మారిటానియా, మైక్రోనేషియా, నేపాల్, మయన్మార్, ఖతార్, రువాండా, శ్రీలంక, అంగోలా, బార్బడోస్, భూటాన్, బొలీవియా, బ్రిటీష్ వర్జిన్ దీవులు, బురుండి, కంబోడియా, కేప్ వెర్డే దీవులు, కొమొరో దీవులు, కుక్ దీవులు, జిబౌటి, డొమినికా, ఇథియోపియా, ఫిజీ, గ్రెనడా, గినియా-బిస్సావు, హైతీ, ఇండోనేషియా, జోర్డాన్, కజకిస్తాన్, కెన్యా, కిరిబాటి, లావోస్, మకావు, మడగాస్కర్, మోంట్సెరాట్, మొజాంబిక్, నియు, పలావు దీవులు, సమోవా, సెనెగల్, సీషెల్స్, సియెర్రా లియోన్, సోమాలియా, సెయింట్ కిట్స్, నెవిస్, లూసియా, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్, టాంజానియా, థాయిలాండ్, తైమూర్-లెస్టే, ట్రినిడాడ్, వీసా లేకుండా టొబాగో, తువాలు, వనాటు, జింబాబ్వే దేశాల్లో ప్రవేశించవచ్చు.