చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్... 16 బిలియన్ల పాస్ వర్డ్స్ సైబర్ ముఠా చేతికి

by Shamantha N |

చరిత్రలోనే అతి పెద్ద డేలా లీక్ అయినట్లు సైబర్ న్యూస్ నివేదిక వెల్లడించింది. దాదాపు 16 బిలియన్ల లాగిన్ వివరాలు పాస్ వర్డ్ డేలా లీక్ అయిందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి

చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్... 16 బిలియన్ల పాస్ వర్డ్స్ సైబర్ ముఠా చేతికి
X

దిశ, నేషనల్ బ్యూరో: చరిత్రలోనే అతి పెద్ద డేలా లీక్ అయినట్లు సైబర్ న్యూస్ నివేదిక వెల్లడించింది. దాదాపు 16 బిలియన్ల లాగిన్ వివరాలు పాస్ వర్డ్ డేటా లీక్ అయిందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. యాపిల్, గూగుల్, ఫేస్‌బుక్, గిట్‌హబ్, టెలిగ్రామ్. ఇతర ప్రభుత్వ వెబ్‌సైట్లు సహా అనేక ప్రముఖ సేవల నుంచి డేటా లీక్ అయినట్లు గుర్తించారు. సైబర్ న్యూస్ నివేదిక ప్రకారం.. గూగుల్, యాపిల్, ఫేస్ బుక్ లాంటి పెద్ద సంస్థల నుంచే కాకుండా వివిధ కంపెనీల లాగిన్లు, వెబ్ సైట్లలోని పాస్ వర్డ్స్ అన్ని లీక్ అయినట్లు తెలుస్తోంది. ఇదే అతిపెద్ద డేటా చౌర్యంగా భావిస్తున్నారు. సోషల్‌ మీడియా లో వీపీఎన్ లాగిన్ లతో పాటు అనేక డెవలపర్ ఫ్లాట్ ఫాంలలోని లక్షల సంఖ్యల ఖాతాల రికార్డు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

బలమైన పాస్ వర్డ్స్ తో..

ఈ లీక్‌లో ఉన్న సమాచారం ద్వారా ఖాతాలను హ్యాక్ చేయడం, వ్యక్తిగత వివరాలు దోచుకోవడం, లక్ష్యంగా పెట్టుకుని ఫిషింగ్ దాడులు చేయడం వంటి చర్యలకు సైబర్ నేరగాళ్లు ప్రణాళికలు రూపొందించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ లీక్ వెనుక ఎవరు ఉన్నారన్నదీ ఇంకా స్పష్టంగా తెలియకపోయినా, సాధారణ వినియోగదారులు తక్షణమే తమ పాస్‌వర్డులను మార్చుకుని, బలమైన పాస్ వర్డ్ లను ఉపయోగించడం ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోవాల్సిన అవసరం అత్యంత కీలకమైందని నిపుణులు సూచిస్తున్నారు. గతంలో 184 మిలియన్ల యూజర్ల లాగిన్‌ వివరాలు, పాస్‌వర్డ్‌లు లీక్‌ అయినట్లు సైబర్ నిపుణులు పేర్కొనగా.. ఇప్పుడు అంతకుమించి పాస్ వర్డ్స్, లాగిన్స్, వివిధ డీటెయిల్స్ లీక్ కావడం గమనార్హం. ఈ దాడుల నుంచే రక్షించుకునేందుకు గూగుల్ పాస్ కీలను సైన్ ఇన్ చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story