- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pahelgam Terror Attack: అక్తర్ బంతిని సచిన్‌లాగా అప్పర్ కట్ ఆడేసిన మోదీ.. దెబ్బ మాములుగా లేదుగా భయ్యా!
Pahelgam Terror Attack: భారత్ -పాక్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు నెలకున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: Pahelgam Terror Attack: భారత్ -పాక్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు నెలకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానెళ్ల ప్రసారాలను భారత్ బ్యాన్ చేసింది. పాక్ న్యూస్, ఎంటర్ టైన్ మెంట్ మీడియాకు చెందిన 16 ఛానళ్లపై ఈ వేటు వేసింది. డాన్ న్యూస్, జియో న్యూస్, సామా టీవీ సహా పలు మీడియా ఛానెళ్లు, కొంతమంది జర్నలిస్టుల అకౌంట్స్ పై ఈ నిషేధం విధించింది. మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఛానెల్లో కూడా ప్రసారాలు అందుబాటులో లేవు.
యూట్యూబ్ ఈ ఛానెళ్లపై క్లిక్ చేయగానే..పూర్తిగా ఖాళీగా ఎలాంటి కంటెంట్ అందుబాటులో లేదు. జాతీయ భద్రత ద్రుష్ట్యా కేంద్రం ఆదేశాల మేకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనే మెసేజ్ కనిపిస్తోంది. ఇప్పటికే పాక్ ప్రభుత్వానికి చెందిన అధికారిక ఎక్స్ అకౌంట్ ను భారత్ లో నిలిపివేసిన విషయం తెలిసిందే. భారత్ కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు, మతపరమైన సున్నితమైన కంటెంట్, తప్పుదోబ పట్టించే కథనాలు ప్రసారం చేస్తున్నారన్న ఆరోపణలపై ఈ యూట్యూబ్ ఛానెళ్లను నిషేధించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఇక పహల్గామ్ దాడి నేపథ్యంలో జమ్ముకశ్మీర్ పోలీసులు స్థానికంగా ఉన్న ఉగ్ర నెట్ వర్క్ ను ఛేదించేందుకు ముమ్మర చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే పలువురు ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేసిన భద్రతా సిబ్బంది..తాజాగా విస్త్రత స్థాయిలో సోదాలు చేపట్టారు. దోడాలోని పలు నివాసాల్లో పెద్దెత్తున తనిఖీలు చేపట్టారు. జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి.






