- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
The First AI War: ఇరాన్ యుద్ధంలో డిజిటల్ విప్లవం..
ఇరాన్ యుద్ధంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. ఇజ్రాయెల్ కచ్చితమైన దాడులవెనుక మూడు ఏఐ టూల్స్.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రస్తుతం ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కేవలం క్షిపణులకే పరిమితం కాలేదు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి ‘ఏఐ యుద్ధం’గా చరిత్రలో నిలిచిపోనుంది. ఒకప్పుడు సైనికుల మేధస్సు, ధైర్యంపై ఆధారపడిన యుద్ధాలు, ఇప్పుడు అల్గారిథమ్స్, డేటా అనలిటిక్స్ వైపు మళ్లాయి. ఇజ్రాయెల్ అమలుచేస్తున్న ఆధునిక యుద్ధతంత్రం భవిష్యత్తులో జరగబోయే యుద్ధాలకు మార్గదర్శనం కానున్నది. అసలు ఈ యుద్ధంలో ఏఐ ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసుకుందాం. ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రధానంగా మూడు ఏఐ వ్యవస్థలను ఒక వ్యూహం ప్రకారం వాడుతున్నాయి. వీటిద్వారా ఇరాన్ లో ఏ లక్ష్యాలను టార్గెట్ చేయాలి.? ఏ వ్యక్తులను టాప్ ప్రయారిటీలోకి తీసుకోవాలి? వారిని ఎలా ట్రాక్ చేయాలి? అన్న అంశాలకు ఏఐ చిటికెలో సమాధానాలు ఇస్తున్నాయి. ఇవే ఇప్పుడు ఇజ్రాయెల్ వజ్రాయుధాలుగా మారాలి. అవేమిటంటే..
ది గోస్పెల్ (The Gospel)..
ఇది ఇజ్రాయెల్ తయారుచేసిన సీక్రెట్ ఏఐ టూల్. ఇది ఇరాన్ పై నిరంతరం తిరుగుతున్న డ్రోన్లు, శాటిలైట్లనుంచి థర్మల్ ఇమేజెస్ తీసుకుని ఏ భవనాల్లో ఎక్కువ సెక్యూరిటీ లేదా అనుమానాస్పద కదలికలు ఉన్నాయో గుర్తిస్తుంది. అంటే ఏదైనా ఎమర్జెన్సీలో ముఖ్యమైన నేతలు ఎక్కడ కలుసుకుంటున్నారో కచ్చితంగా అంచనా వేస్తున్నది. అంటే లావెండర్ మానిటర్ చేస్తున్న 37వేలమందిలో ముఖ్యులు ఎక్కడైతే సమావేశానికి హాజరవుతున్నారో ఆ భవనాన్ని గుర్తిస్తుంది. అది ఎన్ని అంతస్తులు ఉన్నది? దానిని గోడలు ఎంతమందంతో ఉన్నాయి? ఆ భవానాన్ని 360డిగ్రీల్లో పరిశీలించి.. వారంతా ఏ గదిలో సమావేశమయ్యారు? అన్న సమాచారాన్ని గుర్తిస్తుంది. దీంతోపాటు మిసైళ్ల నిల్వలు ఉన్న ప్రాంతాలను కూడా ఇది గుర్తిస్తుంది. మిసైళ్లనుంచి వెలువడే ప్రత్యేకమైన వేడి (థర్మల్ సిగ్నేచర్)ని గుర్తించి.. అక్కడ ఎన్ని మిసైళ్లు ఉన్నాయో? కూడా 100శాతం పక్కగా సమాచారం ఇస్తున్నది. గతంలో ఇజ్రాయెల్ నిఘా విభాగం ఇలాంటి లక్ష్యాలను ఏడాదికి 50 మాత్రమే గుర్తించేది. కానీ, ఇప్పుడు రోజుకు 100కుపైగా ఈ టూల్ గుర్తిస్తున్నది.
లావెండర్ (Lavender)..
దీనిని ఒక మాల్ వేర్. దీనిని ఇరాన్ లోని సీసీటీవీ వ్యవస్థలోకి పంపి.. అక్కడినుంచి వ్యక్తులను ట్రాక్ చేస్తుంది. నిజానికి చాలాకాలంగా సొంత ఇంటర్నెట్ వ్యవస్థను నడుపుతున్నది. ఇది గూగుల్ లేకపోతే ఇతర అమెరికన్ సంస్థల చేతుల్లో కాకుండా సొంత వ్యవస్థ కావడంతో ఎలాంటి ప్రమాదం లేదని ఇరాన్ భావించింది. అయితే, ఇప్పుడు అందరూ అనుమానిస్తున్న విషయం ఏమిటంటే ఈ వ్యవస్థనే ఇజ్రాయెల్ హ్యాక్ చేసి తీసుకున్న డేటాను లావెండర్ అనే ఏఐ రియల్ టైమ్ లో మానిటర్ చేసి ఇజ్రాయెల్ టార్గెట్ చేసిన వ్యక్తులను గుర్తించి వాళ్ల ప్రతి కదలికను ఇజ్రాయెల్ రక్షణ దళమైన ఐడీఎఫ్ కు ఇస్తున్నది. ఇది ఎంత పవర్ ఫుల్ టూల్ అంటే ఇరాన్ లో సుమారు 37వేలకుపైగా వ్యక్తుల డేటాను ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నది. లావెండర్ యాప్ లో భాగమైన మరో టూల్ బ్లూ వోల్ఫ్ ఇది ముఖాన్ని గుర్తించి.. కచ్చితమైన సమాచారాన్ని కమాండ్ సెంటర్ కు పంపుతుంది. ఆ వ్యక్తి వద్ద ఎలాంటి ఎలక్ట్రానికి డివైజులు ఉన్నాయన్న సమాచారం కూడా సేకరిస్తుంది.
వేర్ ఈజ్ డాడీ? (Where's Daddy?)
ఇది మరో టూల్. గోస్పెల్ టూల్ గుర్తించిన కమాండ్ సెంటర్ కి లావెండర్ టూల్ గుర్తించిన వ్యక్తి రాగానే ఈ టూల్ ఫైనల్ కాల్ ఇస్తుంది. అంటే మిసైల్ అటాక్ చేసేందుకు సిద్ధమని ఇజ్రాయెల్ సైన్యానికి సిగ్నల్ ఇస్తుంది. ఆ భవనాన్ని పేల్చేందుకు ఎంత పెలోడ్ అవసరం. దానికి అందుబాటులో ఉన్న ఏ మిసైల్ సరైనదో కూడా చెప్తుంది. ఖమేనీ మరణం తర్వాత సుప్రీం లీడర్ ను ఎన్నుకునేందుకు ముఖ్యనేతలు సమావేశమైన భవనంపై కూడా దాడి జరగడానికి ఈ టూల్సే కారణమని సైనిక నిపుణులు పేర్కొంటున్నారు.
ఇరాన్ ఎదురుదాడి.. ‘లో-టెక్’ వ్యూహం
అత్యాధునిక ఏఐని ఎదుర్కోవడానికి ఇరాన్ కూడా వినూత్న పద్ధతులను అనుసరిస్తున్నది. బహిరంగ ప్రదేశాల్లో నకిలీ క్షిపణి లాంచర్లను ప్రదర్శించి ఏఐని తప్పుదోవ పట్టించడంతోపాటు ముఖ్యమైన నేతలు ఒకేచోట సమావేశం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఖమేనీ చనిపోవడంతోనే ముఖ్యనేతలందరూ స్మార్ట్‌ఫోన్లను నిషేధించి, పాతకాలపు ల్యాండ్ లైన్ టెలిఫోన్లతోపాటు కొరియర్లు అంటే మనుషులతో సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటున్నారు.






