- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Space Station: శుభాంశు శుక్లా రిటర్న్ జర్నీకి ముహూర్తం ఫిక్స్.. భూమిపైకి వచ్చేది అప్పుడే?
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం రిటర్న్ జర్నీకి ముహుర్తం ఫిక్స్ అయింది.

దిశ, డైనమిక్ బ్యూరో: (International Space Station) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారత వ్యోమగామి (Shubhanshu Shukla) శుభాంశు శుక్లా బృందం రిటర్న్ జర్నీకి ముహుర్తం ఫిక్స్ అయింది. భారత కాలమాన ప్రకారం.. ఈ నెల 15న తిరిగి భూమి మీదకు రానున్నారు. శుభాంశు శుక్లా టీమ్ దాదాపు రెండు వారాలుగా పైగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రేపు సాయంత్రం 4.35 గంటలకు శుభాంశు శుక్లా బృందం అన్ డాకింగ్ ప్రారంభం కానుంది. 15వ తేదీన కాలిఫోర్నియా సమీపంలో పసిఫిక్ మహా సముద్రంలో ల్యాండ్ అవ్వనున్నారు.
ఈ ఆప్‌డేట్‌ను ఆదివారం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ (Jitendra Singh) ఎక్స్ వేదికగా వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం 3:00 గంటల సమయంలో వారు భూమికి తిరిగి వచ్చే అవకాశం ఉందని, ఈ సమయాలు దాదాపు ఒక గంట వ్యత్యాసం కూడా ఉండొచ్చని భావించారు. కాగా, జూన్ 25న ఐఎస్ఎస్‌లో ల్యాండ్ అయిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం అనేక పరిశోధనలు చేశారు. స్పేస్ఎక్స్ (Axiom 4) యాక్సియమ్-4 మిషన్‌లో భాగంగా నలుగురు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఇక వీరు భూమిపైకి వచ్చిన తర్వాత వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటారని తెలుస్తోంది. భూ వాతావరణానికి బాగా అలవాటు పడిన తర్వాత వ్యోమగాములు బాహ్య ప్రపంచానికి వస్తారు.






