- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bridge:బ్రిడ్జి వేశారు కానీ..రోడ్డు విస్తరణ మరిచారు!
by Jakkula.Mamatha |
బీహార్‌లోని అరారియా జిల్లాలో వంతెన నిర్మాణం పరిపాలనలో అలజడి సృష్టించింది.

X
దిశ,వెబ్‌డెస్క్:బీహార్‌లోని అరారియా జిల్లాలో వంతెన నిర్మాణం పరిపాలనలో అలజడి సృష్టించింది. రూ.3 కోట్లతో నిర్మించిన వంతెనకు ఇరువైపులా రోడ్డు లేకుండా ఖాళీ మైదానం మధ్యలో ఉంది. వివరాల్లోకి వెళితే.. బిహార్‌లోని అరారియా జిల్లాలో పంట పొలాల మధ్య ఉన్న ఓ బ్రిడ్జి వైరల్ అవుతోంది. పరమానంద్పూర్ గ్రామంలో ఇంకిపోయిన నది మీద రోడ్డు నిర్మాణానికి అధికారులు ముందుగా కొంత ప్రాంతాన్ని మాత్రమే సేకరించి వంతెన నిర్మించారు. తీరా రోడ్డు విస్తరణకు అవసరమైన భూమి సేకరించకుండా వదిలేశారు. దీంతో పంటపొలాల మధ్య బ్రిడ్జి ఎందుకుందంటూ వీడియో వైరల్ అవ్వడంతో అరారియా జిల్లా మేజిస్ట్రేట్ ఇనాయత్ ఖాన్ తాజాగా విచారణకు ఆదేశించారు. ఈ ప్రాంతంలో డెడ్ నది ఉందని, ఇది వర్షాకాలంలో సమస్యగా మారుతుందని..మిగిలిన సంవత్సరం ఎండిపోతుందని స్థానికులు చెబుతున్నారు.
- Tags
- Latest News
- Bihar
Next Story






