- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మందుబాబులకు బిగ్ షాక్.. అమల్లోకి కొత్త నిబంధనలు.. ఇకపై మధ్యాహ్నం మందు బంద్
* దేశంలో మద్యం అమ్మకాలపై కొత్త నిబంధనలు * మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు నో పర్మిషన్ * లేదంటే భారీ జరిమానా విధించే అవకాశం

దిశ, వెబ్ డెస్క్ : థాయ్ లాండ్‌లో మద్యంపై కఠిన నిబంధనలు విధించారు. కొత్తగా సవరించిన చట్టం ప్రకారం.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మద్యం సేవించడం, అమ్మడం, కొనుగోలు చేయడం రద్దు చేసింది ప్రభుత్వం. ఒకవేళ విస్మరిస్తే రూ. 26, 591 జరిమానా విధించనుంది. ఆల్కహాలిక్ బేవరేజ్ కంట్రోల్ యాక్ట్ కింద ఈ నిర్ణయం తీసుకోగా.. నవంబర్ 8 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. అంతేకాదు కొత్త నిబంధనల ప్రకారం మద్యం ప్రచారం వాస్తవ సమాచారానికి పరిమితం చేయబడింది. సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు మద్యాన్ని ప్రోత్సహించేందుకు, యాోడ్స్ చేసేందుకు అనుమతించబడరు. అయితే ఇందుకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి, లైసెన్స్ పొందిన ఎంటర్‌టైన్మెంట్ ఈవెంట్స్, హోటల్స్, విమానాశ్రయాలు, పర్యాటక రంగం కింద ఉన్న సంస్థలు ఈ సమయంలోనూ మందు అమ్మవచ్చు.
అయితే ఈ నియమం రెస్టారెంట్ ఇండస్ట్రీని సమస్యల్లో పడేస్తుందని రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ థాయ్‌లాండ్ అధ్యక్షుడు చానన్ కోట్చరోన్ వాదిస్తున్నారు. ఓ కస్టమర్ తెల్లవారు జామున మందు కొనుక్కుని.. మధ్యాహ్నం 2.05 నిమిషాల వరకు తాగిన నిబంధన ఉల్లంఘన కిందకు వస్తుదని అంటున్నారు. దీంతో అమ్మకాలు తగ్గి పరిశ్రమపై నెగెటివ్ ఇంపాక్ట్ చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






