Thailand : హమాస్ లో విడుదలైన బంధీలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన థాయ్

by Muthe.Rajitha |

గత నెలలో హమాస్(hamas) నుంచి విడుదలైన తమ బంధీలకు థాయ్ లాండ్(Thailand) ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది.

Thailand : హమాస్ లో విడుదలైన బంధీలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన థాయ్
X

దిశ, వెబ్ డెస్క్ : గత నెలలో హమాస్(hamas) నుంచి విడుదలైన తమ బంధీలకు థాయ్ లాండ్(Thailand) ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. వారికి జీవితాంతం ప్రతినెలా 725 యూరోల పెన్షన్(సుమారు రూ. 65,630) ప్రకటించింది. అంతేకాదు.. తక్షణ సాయం కింద 14,510 యూరోలు (సుమారు రూ. 13,13,500) అందజేస్తామని థాయ్ ప్రభుత్వం ప్రకటించింది. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడుల సమయంలో ఐదుగురు థాయ్ కి చెందిన కార్మికులు కిడ్నాప్‌కి గురయి.. దాదాపు 500 రోజుల నిర్భంధం తర్వాత వారంతా గత జనవరి 30న క్షేమంగా విడుదలయ్యారు. ఈ క్రమంలో వారంతా ఆదివారం ఉదయం తమ సొంతగడ్డ బ్యాంకాక్(Bankak) లోని సువర్ణభూమి విమానాశ్రయం(Suvarnabhumi Airport)లో అడుగు పెట్టారు. దీంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా కన్నీటి సంద్రంగా మారిపోయింది. అసలు ఎక్కడ ఉన్నారో, బతికే ఉన్నారో లేదో, ప్రాణాలతో చూస్తామో లేదో కూడా తెలియని దుర్భర రోజుల నుంచి తమ కుటుంబీకులను కలుసుకోవడంతో బందీలు, వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు.

కాగా వీరికి థాయ్ ప్రభుత్వం ఓ శుభవార్త అందించింది. ఇక వారు జీవితాంతం సంతోషంగా బతికేందుకు ప్రతినెలా 725 యూరోలను అందించనున్నట్టు థాయ్ కార్మిక మంత్రిత్వ శాఖ అధికారి బూన్‌సాంగ్ తప్‌ చాయియుత్ తెలిపారు. తమ దేశానికి చెందిన కార్మికులు క్షేమంగా రావడం పట్ల థాయ్ విదేశాంగ మంత్రి మారిస్ సంగియంపోంగ్సా సంతోషం వ్యక్తం చేశారు. మరొక బందీ ఆచూకీ ఇప్పటి వరకు తెలియ రాలేదని.. ఆ ఒక్కరిని కూడా క్షేమంగా తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తామని అన్నారు. అయితే బ్యాంకాక్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం, అక్టోబర్ 2023 నుండి మొత్తం 46 మంది థాయ్ కార్మికులు ఇజ్రాయెల్‌లో మరణించారు. వీరిలో ఎక్కువ మంది హమాస్ దాడిలో మరణించగా, లెబనాన్‌లోని హిజ్బుల్లా గ్రూప్ ప్రయోగించిన రాకెట్ల వల్ల కొందరు మరణించారు.

2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌(Israel)పై దాడి చేసినప్పుడు హమాస్ 251 మంది బందీలను పట్టుకుని, దాదాపు 1,200 మందిని చంపడంతో.. ఆ పరిణామాలు గాజా యుద్ధాని(Gaja War)కి దారితీశాయి. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ చేసిన దాడిలో కనీసం 47,500 మంది పాలస్తీనియన్లు మరణించారని, గాజాలోని మూడింట రెండు వంతుల భవనాలు ధ్వంసమయ్యాయని ఐక్యరాజ్యసమితి(UNO) తెలిపింది. 2025, జనవరి 19న ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం(Israel-Hamas Ceasefire Agreement) జరిగింది. ఈ ఒప్పందం కింద ఇప్పటివరకు 21 మంది ఇజ్రాయెల్ బందీలు, 566 మంది పాలస్తీనా ఖైదీలను విడుదలయ్యారు.

Next Story