27 ఏళ్ల క్రితం ఫ్లైట్ క్రాష్.. 11A సీటులోనే బతికిన థాయ్ నటుడు

by Shamantha N |   (  Updated:2025-06-14 15:52:46  IST  )

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఇప్పటి వరకు 274 మంది చనిపోగా ఇంకా కొంతమంది గాాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో మృత్యుంజయుడు రమేశ్ విశ్వాస్ కుమార్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ పొందుతున్నాడు. ఎ

27 ఏళ్ల క్రితం ఫ్లైట్ క్రాష్..  11A సీటులోనే బతికిన థాయ్ నటుడు
X

దిశ, నేషనల్ బ్యూరో: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఇప్పటి వరకు 274 మంది చనిపోగా ఇంకా కొంతమంది గాాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో మృత్యుంజయుడు రమేశ్ విశ్వాస్ కుమార్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ పొందుతున్నాడు. ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ విమానంలో 11A సీటులో కూర్చున్న రమేశ్ ప్రమాదం నుంచి త్రుటిలో బయటి పడ్డాడు. ఈ దుర్ఘటనలో రమేశ్ ఒక్కడే ప్రాణాలతో బయటపడగా 11A సీటు ప్రత్యేకత గురించి అందరూ చర్చించుకుంటుండగా.. థాయ్ నటుడు, సింగర్ రువాంగ్ ఫేస్ బుక్ లో చేసిన పోస్టు జనాల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

11A సీటా.. మజాకా

27 సంవత్సరాల క్రితం ఘోరమైన విమాన ప్రమాదం నుంచి థాయ్ నటుడు-గాయకుడు రువాంగ్‌సాక్ బయటపడ్డాడు. తాను కూడా ఇలాంటి ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డానని తన సీటు కూడా 11A కావడం విచిత్రంగా ఉందని సోషల్ మీడియాలో చేసిన పోస్టులో తెలిపాడు. డిసెంబర్ 11, 1998 సంవత్సరంలో థాయ్ ఎయిర్‌వేస్ విమానం TG261 దక్షిణ థాయిలాండ్‌లో దిగడానికి ప్రయత్నిస్తుండగా చిత్తడి నేలలోకి పడిపోవడంతో 101 మంది మరణించారు. 20 ఏళ్ల రువాంగ్‌సాక్ లాయ్‌చుసాక్ మాత్రం 11A సీటులో ఉండగా ప్రాణాలతో బయటపడ్డాడు.

11A సీటు లో ఉన్న వ్యక్తి బతికాడని తెలిసి గూస్ బంప్స్

ఎయిర్ ఇండియా విమానం AI171 ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ రమేశ్ విశ్వాస్ కుమార్ 11A సీటులో కూర్చున్నాడని తెలుసుకున్న తర్వాత తనకు గూస్ బంప్స్ వచ్చాయని ఏళ్ల రువాంగ్‌సాక్ (47) చెప్పాడు.థాయ్‌లో రాసిన ఫేస్‌బుక్ పోస్ట్‌లో రువాంగ్‌సాక్ ‘ఇండియాలో విమాన ప్రమాదం నుంచి బయటపడిన వ్యక్తి 11A సీటులో కూర్చున్నాడు. ఇది నిజంగా మిరాకిల్ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. రువాంగ్‌సాక్ 1998 నాటి బోర్డింగ్ పాస్ తన వద్ద లేదని, కానీ వార్తాపత్రిక కథనాలు తన సీటు నంబర్ గురించి రాశాయని ఆయన పేర్కొన్నారు. ఈ విమాన ప్రమాదం తర్వాత పదేళ్ల పాటు తాను విమాన ప్రయాణం చేయలేదని రువాంగ్ చెప్పాడు. తనకు మళ్లీ పునర్జన్మ లభించిందని ఆయన పేర్కొన్నాడు.

11A సీటు ఇక హాట్ కేక్ లాంటిదే

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 11A సీటులో ఉన్న రమేశ్ విశ్వాస్ కుమార్ ప్రాణాలతో బయటపడటం, 27 ఏళ్ల క్రితం జరిగిన థాయ్ విమాన ప్రమాదంలో నటుడు రువాంగ్ కూడా సేమ్ 11A సీటులో కూర్చుని బతకడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రతి విమానంలో ఈ సీటుకు ఇప్పుడు ప్రత్యేక గిరాకీ ఉంటుందని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ప్రాణం కంటే విలువైనది ఏముంటుంది అందుకే ఇప్పుడు 11A సీటు కోసం బుక్ చేసుకునేందుకు ప్యాసింజర్లు ఎగబడతారని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Next Story