- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉగ్రవాదుల దాడి.. 50 మంది సైనికులు మృతి
ఉగ్రవాదాన్ని అంతమొందించాలని ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తుంటే.. మరోవైపు ఉగ్రవాదుల మాత్రం తమ దాడులు ఆపడం లేదు.

దిశ,వెబ్ డెస్క్: ఓ వైపు ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు పోరాడుతుంటే.. మరో వైపు ఉగ్రవాదులు మాత్రం తమ ఆకృత్యాలు ఆపటం లేదు. తాజాగా బుర్కినా ఫాసో (Burkina Faso)లోని డార్గో ప్రాంతంలో ఉన్న సైనిక స్థావరంపై ఉగ్ర దాడికి (Terrorist attack) దిగారు. జులై 28న జమాత్ నస్రల్ ఇస్లామ్ వాల్ ముస్లిమీన్ (JNIM) అనే అల్కాయిదా అనుబంధ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. దాదాపు 100 మంది ఇందులో పాల్గొన్నట్లు సమాచారం. ఈ ఉగ్ర దాడిలో సుమారు 50 మంది సైనికులు మృతి చెందారు. ఉగ్రదాడి తర్వాత స్థావరాన్ని తగలబెట్టి ఆయుధాలను లూటీ చేసినట్లు స్థానికులు తెలిపారు కాగా, ఈ సంఘటన పశ్చిమ ఆఫ్రికాలో పెరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలకు మరో ఉదాహరణగా నిలిచింది. బుర్కినా ఫాసోలో గత కొంతకాలంగా అల్కాయిదా, ఐసిస్ అనుబంధ సంస్థల నుంచి భద్రతా బలగాలకు భారీ నష్టాలు వాటిల్లుతున్నాయి. సైనిక నాయకుడు ఇబ్రహీం ట్రాయోర్ రాజకీయ, సైనిక మిత్రదేశాలను పునర్వ్యవస్థీకరించినప్పటికీ, ఇస్లామిస్ట్ సమూహాలను నియంత్రించడంలో విఫలమయ్యారు.
Also Read..
యంగ్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం.. కన్నీళ్లు తెప్పిస్తున్న ఎమోషనల్ పోస్ట్






