Terror attack on Israeli rally: కొలరాడో లో ఇజ్రాయిలీ ర్యాలీపై టెర్రర్ ఎటాక్

by Shamantha N |

అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలోని బౌల్డర్ పట్టణంలో ఇజ్రాయిలీలపై ఓ పాలస్తీనా వ్యక్తి పెట్రోల్ బాంబులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. కొలరాడోలోని బౌల్డర్ పట్టణంలో ఆదివారం ఇజ్రాయిలీలు బందీలను విడుదల చేయాలని ‘రన్ ఫర్ దేర్ లైవ్స్’ అనే స్మారక యాత్ర చేపట్టారు.

Terror attack on Israeli rally: కొలరాడో లో ఇజ్రాయిలీ ర్యాలీపై టెర్రర్ ఎటాక్
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలోని బౌల్డర్ పట్టణంలో ఇజ్రాయిలీలపై ఓ పాలస్తీనా వ్యక్తి పెట్రోల్ బాంబులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. కొలరాడోలోని బౌల్డర్ పట్టణంలో ఆదివారం ఇజ్రాయిలీలు బందీలను విడుదల చేయాలని ‘రన్ ఫర్ దేర్ లైవ్స్’ అనే స్మారక యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా పాలస్తీనాకు చెందిన వ్యక్తి మాల్టోవ్ కాక్ టెయిల్స్ (ఒక రకమైన పెట్రోల్ బాంబు) (terrorist attack) సీసాలో పట్టుకుని వచ్చి వారిపై దాడికి పాల్పడ్డాడు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించగా ఒకరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు ఆఫీసర్లు పేర్కొన్నారు. దాడికి పాల్పడ్డ వ్యక్తిని మొహమ్మద్ సబ్రీ సోలిమాన్‌గా గుర్తించారు. అతను ఇజ్రాయిలీలపై దాడి చేస్తూ ‘ఫ్రీ పాలస్తీనా’ ‘Palestine’ అంటూ నినాదాలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాడి జరిగిన ప్రాంతాన్ని ప్రస్తుతం ఎఫ్ బీఐ ఆధీనంలోకి తీసుకుంది.

ప్రాణాలతో బయటపడటం అదృష్టం

ఘటన జరిగిన వెంటనే పోలీసులు తక్షణమే స్పందించి సోలిమాన్‌ను అరెస్టు చేశారని తెలిపారు. ఈ ఘటన తర్వాత చాలామంది ప్రాణాలతో బయటపడటం అదృష్టమని బౌల్డర్ (Boulter City) పోలీస్ చీఫ్ స్టీఫెన్ రెడ్‌ఫెర్న్ అన్నారు. ఇటీవలి కాలంలో అమెరికాలో యూదులకు వ్యతిరేకంగా దాడులు పెరుగుతున్నాయని రాయిటర్స్ నివేదిక లో పేర్కొంది. గాజాలో మానవతాసాయం చేస్తున్న సంస్థపై ఇజ్రాయిల్ దాడులు చేసినట్లు హమాస్ ఆరోపణలు చేసింది. కాగా ఇజ్రాయిల్ గాజాలో నిన్న చేసిన దాడుల్లో దాదాపు 26 మంది మృతి చెందగా మరో 80 మంది వరకు గాయపడ్డారు. శాంతి చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికా చెబుతున్నప్పటికీ హమాస్ దీనికి ఒప్పుకోవడం లేదు.

Next Story