మళ్లీ టెన్షన్.. పరస్పర దాడులకు దిగిన ఇరాన్-అమెరికా

by velandi.Saikiran |

మళ్లీ టెన్షన్ మొద‌లైంది. ఇరాన్-అమెరికా పరస్పర దాడులకు దిగాయి.

మళ్లీ టెన్షన్.. పరస్పర దాడులకు దిగిన ఇరాన్-అమెరికా
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇరాన్ వర్సెస్ అమెరికా మధ్య మరోసారి పరస్పర దాడులకు దిగాయి. దీంతో రెండు దేశాల మధ్య మళ్లీ టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. తమ ఆయిల్ ట్యాంకర్ పై దాడిని ప్రతి ఘటిస్తూ హార్ముజ్ జలసంధిలోని మూడు అమెరికా నౌకలపై ఇరాన్ దాడి చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది ఇరాన్. దానికి బదులుగా అమెరికా... ఇరాన్ పోర్టులపైన దాడులకు దిగింది. అయితే తాము ఎలాంటి ప్రేరేపిత చర్యలకు పాల్పడలేదని అమెరికా చెబుతోంది. ఇరానే ముందు దాడి చేసిందని మండిపడుతోంది. ఇది కేవలం ఆత్మ రక్షణ కోసం చేసిన దాడి అని పూర్తిస్థాయి యుద్ధానికి తెర దీయలేదని అమెరికా స్పష్టం చేసింది.

డీల్ చేసుకోకపోతే విరుచుకుపడతాం - ట్రంప్ వార్నింగ్

ఇరాన్ వర్సెస్ అమెరికా మధ్య మళ్ళీ జరిగిన కాన్పుల నేపథ్యంలో డీల్ పై ఒత్తిడి తెస్తూ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వీలైనంత త్వరగా ఒప్పందం చేసుకోకపోతే భీకర దాడులతో విరుచుకుపడతామని హెచ్చరించారు. ఇరాన్ దాడుల్లో తమ మూడు యుద్ధ నౌకలకు ఎలాంటి నష్టం జరగలేదన్నారు. ఎదురుదాడుల్లో అనేక ఇరాన్ డ్రోన్లు, బోట్లు ధ్వంసం అయ్యాయని తెలిపారు.

Next Story